te_ta/translate/figs-pastforfuture/01.md

6.4 KiB

వర్ణన

ఊహాజనిత గతం అనేది భవిషత్తులో జరగబోయే వాటిని చెప్పడానికి గతసంభవాన్ని ఉపయోగించే భాషాలంకారం. దీన్ని కొన్ని సార్లుతప్పకుండా జరుగుతుందని చెప్పడానికి ప్రవచనంలో వినియోగిస్తారు.దీన్ని ప్రవచన పరిపూర్ణం అంటారు.

అందువల్ల నా ప్రజలు జ్ఞానం లేక చెరలోకి వెళ్లిపోతున్నారు; వారిలో ఘనులు పస్తులుంటున్నారు. సామాన్యులు దాహంతో అలమటిస్తున్నారు. (యెషయా 5:13 TELIRV)

పై ఉదాహరణలో ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా చేరలోకి వెళ్ళలేదు. అయితే వారు అలా ఇప్పటికే వేల్లిపోయినట్టు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారు తప్పక అలా వెళ్తారని ఆయన నిర్ణయించాడు.

ఇది అనువాద సమస్య అనడానికి కారణాలు:

ప్రవచనంలో భూతకాలం గురించి తెలియని పాఠకులు భవిషత్తు గురించి అయోమయంలో పడతారు.

బైబిల్ నుండి ఉదాహరణలు

ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను." (యెహో6:1-2 TELIRV)

ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది; (యెషయా 9:6 TELIRV)

పై ఉదాహరణల్లో భవిషత్తులో జరగనున్నవి జరిగిపోయినట్టు దేవుడు మాట్లాడుతున్నాడు.

ఆదాము నుండి ఏడవవాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు. (యూదా 1:14 TELIRV)

భవిషత్తులో జరగనున్నవాటి గురించి హనోకు మాట్లాడుతున్నాడు. కానీ భూతకాలం ప్రయోగిస్తున్నాడు.

అనువాద వ్యూహాలు

మీ భాషలో భూతకాలం సహజంగా ధ్వనిస్తూ సరైన అర్థం ఇస్తున్నట్టయితే దాన్ని వాడండి. అలా కాకుంటే వేరే ఉపాయాలున్నాయి.

  1. భవిషత్తు విషయాల కోసం భవిషత్కాలం ఉపయోగించండి.
  2. త్వరలో నెరవేరే విషయాలైతే అలా చూపించే భాష వాడండి.
  3. కొన్ని భాషల్లో త్వరలో జరగనున్న వాటిని చెప్పడానికి వర్తమాన కాలాన్ని వాడతారు.

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

  1. భవిషత్తు విషయాలకోసం భవిషత్కాలం ఉపయోగించండి.
  • ** ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు ** (యెషయా 9:6a TELIRV)
    • "మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది
  1. త్వరలో నెరవేరే విషయాలైతే అలా చూపించే భాష వాడండి.
  • అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను" (యెహో6:2 TELIRV)
    • అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగించబోతున్నాను
  1. కొన్ని భాషల్లో త్వరలో జరగనున్న వాటిని చెప్పడానికి వర్తమాన కాలాన్ని వాడతారు.
  • ** అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను"**(యెహో6:2 TELIRV)

అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను"**