te_ta/intro/open-license/01.md

8.5 KiB

స్వేచ్ఛకు లైసెన్సు

ప్రతి భాషలోనూ**ప్రతిబంధకాలు లేని బైబిల్ విషయాన్నీ **పొందగలిగే స్వేచ్ఛ. భౌగోళిక సంఘానికి ఇలాటి “ప్రతిబంధకాలు లేని” , స్వేచ్ఛతో కూడిన బైబిల్ విషయాల అందుబాటు అవసరం. సంఘానికి “ప్రతిబంధకాలు లేని” రీతిలో విషయం అందుబాటులోకి వస్తే ఈ ఉద్యమాన్ని ఇక ఎవరూ ఆపలేరని మాకు తెలుసు. ఈ   4.0 అంతర్జాతీయ లైసెన్సు బైబిల్ విషయం అనువాదం కోసం, పంపిణి కోసం అవసరమైన మార్గాలన్నీ అందుబాటులోకి వస్తాయి. వేరే విధంగా చెప్పానంత వరకూ బైబిల్ విషయమంతా CC BY-SA లైసెన్సు కింద ఉంటుంది..

  • Door43 కొరకైన అధికారిక లైసెన్సు దగ్గర లభ్యం అవుతున్నది.

4.0 అంతర్జాతీయ లైసెన్సు (CC BY-SA 4.0)

ఇది మనుషులు చదవగలిగిన సంక్షిప వివరణ మాత్రమే. (ఇది అసలు లైసెన్సుకు ప్రత్యామ్నాయం కాదు) , license.

మీకు ఈ క్రింద చెప్పిన వాటికి స్వేచ్ఛ ఉంది:

  • పంచుకోవడం — ఏ మాధ్యమంలోనైనా కాపీలు తీసుకుని మరలా ఏ మాధ్యమంలోనైనా, స్వరూపంలోనైనా పంపిణి చేయడానికి.
  • మలుచుకోవడం — వేరుగా కలగలుపు చేసుకోవడం, ప్రసారం చేయడం, రూపాంతరం చెందించడం, ఉన్న విషయానికి మరింత చేర్చడం.

ఏ ఉద్దేశంతోనైనా, వ్యాపార ఉద్దేశంతో కూడా కావచ్చు.

లైసెన్సు లోని నిబంధనలను మిరి మీరనంత వరకూ లైసెన్సు ఇచ్చేవాడు ఈ స్వేచ్ఛను ఉపసంహరించుకోలేడు.

ఈ నిబంధనల కింద:

  • ఆపాదింపు — మీరు మొదట రాసిన వాడికి తగిన విధంగా గుర్తింపును ఆపాదించాలి. ఆ లైసెన్సు కు లింకు ను చెప్పాలి. మీరు ఏమైనా మార్పులు చేస్తే వాటిని పేర్కొనాలి. ఏదో ఒక సహేతుకమైన రీతిలో దీన్ని చెయ్యాలి. కానీ లైసెన్సు ఇచ్చిన వ్యక్తి నిన్ను గానీ ని వాడకాన్ని గానీ సమర్థించినట్టు ఉండకూడదు.
  • ** యథాతథ పంచుకోలు** —ఉన్న దాన్ని కలగలిపి మార్చినా రూపాంతరం చెందించినా దానికి అదనంగా కలిపినా నీవు చేసిన పని అంతటినీ మూలం ఏ లైసెన్సు కింద ఉన్నదో అదే లైసెన్సు లో పంపిణి చెయ్యాలి.

** అదనంగా ఎలాంటి ప్రతిబంధకాలు ఉండకూడదు** — ఈ లైసెన్సు వాడకందారులకు అనుమతి నిస్తున్న వాటిని పరిమితం చేసేటందుకు ఎలాంటి చట్టపరమైన, సాంకేతికమైన, అంశాలు విధించకూడదు..

సూచనలు:

పబ్లిక్ డొమెయిన్ లో ఉన్న ప్రచురణల విషయాల లో ఎలాంటి లైసెన్సు నిబంధనలు పాటించనక్కర లేదు. లేక నీవు దాన్ని వాడుకోవడం లో మినహాయింపులు, పరిమితులు ఉన్నప్పుడు కూడా.

ఎలాంటి వారెంటిలూ ఉండవు. నీవు కోరిన వాడకానికి అవసరమైన అన్ని అనుమతులూ ఈ లైసెన్సు ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకు పబ్లిసిటీ, ప్రైవసీ లేక నైతిక హక్కులూ మొదలైనవి నీవు ఈ మూలాన్ని వాడుతున్నావు అనే దానికి పరిమితి విధించా వచ్చు.

మూలంలో నుండి మలిచి తయారు చేసే వాటిని గురించి ఆపాదింపు ప్రకటన ఇలా ఉండవచ్చు: “Door43 వరల్డ్ మిషన్ కమ్యూనిటి సృష్టించిన ఈ అంశం http://door43.org/, లో అందుబాటులో ఉన్నది. దీన్ని   4.0 అంతర్జాతీయ లైసెన్సు కింద విడుదల చేస్తున్నాము. (http://creativecommons.org/licenses/by-sa/4.0/ ). ఈ అంశాన్ని మూలానికి భిన్నంగా కొన్ని మార్పులు చేసాం. ఈ మార్పులను మూలం రచయితలు సమర్థించలేదు.

Door43 రచయితల ఆపాదింపు

Door43 లోకి ఏదైనా సమాచారాన్ని తెచ్చుకునేటప్పుడు, మూలాన్ని అది ఎక్కడ అందుబాటులో ఉన్నదో ఆ స్వేచ్చాయుతమైన లైసెన్సులో నిర్దేశించిన రీతిగా ఆపాదించడం జరగాలి. ఉదాహరణకు, ఓపెన్ బైబిల్ కథల్లో ఉన్న బొమ్మలను స్పష్టంగా ఆ ప్రాజెక్టుకు ఆపాదించడం చూడవచ్చు. ముఖ్య పేజీ.

Door43 రచయితలు దీనిని ఒప్పుకుంటున్నారు ఇక్కడి ప్రతి పేజీలోనూ పునశ్చరణ చరిత్రలో దానికదే కనిపిస్తున్న ఆపాదింపు వారి పనికి సరిపోయిన ఆపాదింపు. అంటే Door43యొక్క ప్రతి రచయితనూ "Door43 వరల్డ్ మిషన్ సమాజంగ" గా, లేక ఆ అర్థం ఇచ్చేలా చూపించాలి. ప్రతి రచయిత రాసిన సమాచారం అంతా ఆ రచన పునశ్చరణ చరిత్రలో కనిపించాలి.

మూల గ్రంథాలు

మూల గ్రంథాలను ఈ క్రింది లైసెన్సుల్లో ఏదో ఒకటి ఉంటే వాడుకోవచ్చు:

మరింత సమాచారం కోసం Copyrights, Licensing, and Source Texts చూడండి.