te_ta/translate/translate-source-licensing/01.md

6.7 KiB
Raw Permalink Blame History

ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది?

మూల గ్రంధాన్ని అనువాదం చేయాలని అనుకొన్నప్పుడు, ప్రచురణాధికారానికి (కాపీరైట్)/అనుమతి పత్రానికి (లైసెన్స్) ఉన్న సమస్యలకు సంబంధించి, ప్రాముఖ్యంగా రెండు విషయాలను పరిగణనలోనికి తీసుకోవాలి. మొదటది, మీరు ప్రచురణాధికారం హక్కు కలిగిన హక్కుదారుని ముందస్తు అనుమతి లేకుండా దానిని అనువదిస్తే, మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని లెక్క. ఎందుకంటే అనువాదానికి సంబంధించి దాని లోపల లిఖితమైనదంతా సంబంధిత యజమానికి ప్రత్యేకించిన హక్కుగా పరిగణిస్తారు. కొన్ని దేశాలలో ప్రచురణాధికార ఉల్లంఘన అనేది శిక్షార్హమైన నేరం. అంతేకాదు ప్రచురణాధికార హక్కుదారుని అనుమతి లేకుండా కూడా ప్రభుత్వం విచారణ చేయవచ్చు! రెండవది, ప్రచురణాధికారం ఇచ్చిన రచనకు సంబంధించి అనువాదం పూర్తయినప్పుడు, అనువాదం అనేది మూల గ్రంధానికి చెందిన ప్రచురణాదికారం కలిగిన హక్కుదారుని మేధో సంపత్తి. వారు మూల గ్రంధానికి చేసినట్లే అనువాదానికి సంబంధించిన హక్కులన్నిటిని కొనసాగిస్తారు. ఇతర కారణాల వల్ల ఆ విధంగా వెల్లడించని అనువాదాలను పంపిణి చేయవచ్చు, అవి ప్రచురణ అధికార ఉల్లంఘించవు.

మనం ఎలాంటి అనుమతి పత్రాన్ని ఉపయోగించాలి?

** క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-షేర్అలైక్4.0 లైసెన్స్ (CC BY-SA) ** కింద అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రచురించిన పూర్తి సమాచారం విడుదల చెయ్యదమైంది. (http://creativecommons.org/licenses/by-sa/4.0/ చూడండి) ఈ అనుమతి పత్రం అనేది సంఘానికి గొప్ప సహాయం అని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఇది అనువాదం చేయడానికీ, ఇంకా దాని నుండి ఉత్పన్నమైయ్యే ఇతరత్రా వాటిని తయారు చేయడానికి సరిపడినంత అనుమతి ఉంది. కానీ ఆ విధంగా ఉత్పన్నమైన వాటిని నిర్బంధ లైసెన్సుల క్రింద కట్టడి చేయవచ్చు. ఈ సమస్యపై పూర్తి చర్చ కోసం, ది క్రిస్టియన్ కామన్స్ చదవండి. (http://thechristiancommons.com/ చూడండి).

ఏలాంటి మూల గ్రంధాలను ఉపయోగించవచ్చు?

మూల గ్రంథాలు ప్రజలకు అందుబాటులోని పరిధిలో ఉన్నట్లయితే లేదా క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-షేర్అలైక్ అనుమతితో అనువదించబడిన గ్రంథం విడుదల చెయ్యబడడానికి అనుమతి ఇచ్చే కింది అనుమతులు ఒక దానికింద అందుబాటులో ఉన్నట్లయితే:

ప్రశ్నలో ఉన్నఅన్నిఇతర రచనల కోసం, దయచేసిhelp@door43.orgని సంప్రదించండి

** గమనిక: **

  • అనువాద కార్యాలయంలో (ట్రాన్స్ లేషన్ స్టూడియోలో) మూల గ్రంధాలుగా కనిపించే అన్నిమూల గ్రంధాలనూ సమీక్షించడమైంది. మూల గ్రంధ రచనలను ఎవరైనా ఉపయోగించేందుకు చట్టబద్ధo చెయ్యబడ్డాయి.
  • ఏదైనా అన ఫోల్దింగ్ వర్డ్ ద్వారా ప్రచురించడానికి ముందు, మూల వచనాన్నిసమీక్షించీ, పైన పేర్కొన్న అనుమతులలో ఒక దాని క్రింద అందుబాటులో ఉండాలి. మీ అనువాదం ప్రారంభించడానికి ముందే అది ప్రచురించబడకుండా ఉండేదానిని తప్పించడానికి మీరు దయచేసి మీ మూల గ్రంధాన్ని తనిఖీ చేయండి.