te_obs-tn/content/40/04.md

3.1 KiB

ఇద్దరు దొంగలు

దీనిని "ఇద్దరు బందిపోట్లు" అని కూడా అనువదించవచ్చు. వస్తువులను దొంగిలించడానికి బలాన్ని, లేదా హింసను ఉపయోగించిన నేరస్థులను ఇది సూచిస్తుంది.

దేవుని భయం నీకు లేదా?

దొంగ ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆశించలేదు; ఇది కొన్ని భాషలలో బలంగా తెలియచేయడానికి ఉపయోగించే విధానం. మీ భాషలో ఈ విధంగా ప్రశ్నలను ఉపయోగించకపోతే, అప్పడు దీనిని "మీరు దేవునికి భయపడాలి!" అని అనువదించండి.

మనం దోషులు, ఈయన నిర్దోషి

దీనిని ఈ విధంగా అనువదించవచ్చు, "నీవూ, నేనూ చెడు పనులు చేసాము, అందువల్ల మనం చావడానికి తగినవారం, కాని యేసు అనే ఈ మనిషి ఏ తప్పు చేయలేదు, చనిపోయే అవసరం ఈయనకు లేదు." ఇక్కడ "మేము" అనేది, ఇద్దరు దొంగలను చూపుతుంది, కాని ఇందులో యేసును చేర్చలేదు.

ఈ మనిషి

ఈ మాట యేసును సూచిస్తుంది.

దయచేసి నన్ను గుర్తుంచుకో

అంటే, "దయచేసి నన్ను అంగీకరించు" లేదా, "దయచేసి నన్ను స్వాగతించు" లేదా, "దయచేసి, నీతో ఉండటానికి నన్ను అనుమతించండి." ఇక్కడ "గుర్తుంచుకో" అంటే ఏదో మర్చిపోయిన తర్వాత, దానిని గుర్తుకు తెచ్చుకోవడం కాదు. వినయపూర్వకమైన అభ్యర్థనను తెలియజేసే విధంగా దీనిని అనువదించండి.

నీ రాజ్యంలో

అంటే, "నీవు నీ రాజ్యాన్ని స్థాపించినప్పుడు" లేదా, "నీవు రాజుగా పరిపాలించేటప్పుడు."

పరదైసు

ఇది "స్వర్గం/పరలోకం"కు మరొక పేరు.

అనువాదం పదాలు