te_obs-tn/content/38/08.md

31 lines
2.3 KiB
Markdown

# ఒలీవల కొండ
యెరూషలేo నగరపు గోడలకు వెలుపల ఒలీవల చెట్లతో ఉన్న కొండ పేరు ఇది. దీనిని "ఒలీవల చెట్ల కొండ" అని కూడా అనువదించవచ్చు.
# నన్ను వదిలివేస్తారు
అంటే, "నన్ను విడిచిపెడతారు" లేదా, "నన్ను వదిలేస్తారు."
# రాసి ఉంది
అంటే, "ఇది దేవుని వాక్యంలో వ్రాయబడింది" లేదా "ఇది లేఖనాల్లో వ్రాయబడింది" లేదా "దేవుని ప్రవక్తలలో ఒకరు వ్రాశారు." "వ్రాసినది జరుగుతుంది" లేదా "ఇది వ్రాసినట్లుగా ఉంటుంది" అని కూడా చెప్పవచ్చు. ఈ ప్రవచనం యేసు మరణాన్నీ, ఆయన అనుచరులు పారిపోవడాన్ని సూచిస్తుంది.
# నేను కొడతాను
అంటే, "నేను చంపుతాను."
# గొర్రెల కాపరి, గొర్రెలన్నియు
ఈ వ్యాఖ్యానంలో యేసు అనే పేరును ఉపయోగించవద్దు, ఎందుకంటే మొదటగా రాసిన ప్రవక్తకు గొర్రెల కాపరి పేరు తెలియదు. అలాగే, గొర్రెలను గూర్చి శిష్యులుగా సూచించవద్దు. మీ అనువాదంలో "గొర్రెల కాపరి","గొర్రెలు" అనే పదాలను ఉపయోగించడమే ఉత్తమం.
# చెల్లాచెదురై పోతాయి
అంటే, "వివిధ దిశలకు వెళ్లిపోతారు."
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/other/shepherd]]
* [[rc://*/tw/dict/bible/other/sheep]]