te_obs-tn/content/38/08.md

2.3 KiB

ఒలీవల కొండ

యెరూషలేo నగరపు గోడలకు వెలుపల ఒలీవల చెట్లతో ఉన్న కొండ పేరు ఇది. దీనిని "ఒలీవల చెట్ల కొండ" అని కూడా అనువదించవచ్చు.

నన్ను వదిలివేస్తారు

అంటే, "నన్ను విడిచిపెడతారు" లేదా, "నన్ను వదిలేస్తారు."

రాసి ఉంది

అంటే, "ఇది దేవుని వాక్యంలో వ్రాయబడింది" లేదా "ఇది లేఖనాల్లో వ్రాయబడింది" లేదా "దేవుని ప్రవక్తలలో ఒకరు వ్రాశారు." "వ్రాసినది జరుగుతుంది" లేదా "ఇది వ్రాసినట్లుగా ఉంటుంది" అని కూడా చెప్పవచ్చు. ఈ ప్రవచనం యేసు మరణాన్నీ, ఆయన అనుచరులు పారిపోవడాన్ని సూచిస్తుంది.

నేను కొడతాను

అంటే, "నేను చంపుతాను."

గొర్రెల కాపరి, గొర్రెలన్నియు

ఈ వ్యాఖ్యానంలో యేసు అనే పేరును ఉపయోగించవద్దు, ఎందుకంటే మొదటగా రాసిన ప్రవక్తకు గొర్రెల కాపరి పేరు తెలియదు. అలాగే, గొర్రెలను గూర్చి శిష్యులుగా సూచించవద్దు. మీ అనువాదంలో "గొర్రెల కాపరి","గొర్రెలు" అనే పదాలను ఉపయోగించడమే ఉత్తమం.

చెల్లాచెదురై పోతాయి

అంటే, "వివిధ దిశలకు వెళ్లిపోతారు."

అనువాదం పదాలు