te_obs-tn/content/37/01.md

29 lines
2.3 KiB
Markdown

# ఒక రోజు
ఈ వాక్యం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది, కానీ నిర్దిష్ట సమయాన్ని పేర్కొనలేదు. వాస్తవమైన కథ ప్రారంభించి చెప్పడానికి చాలా భాషలలో ఇలాంటి విధానం ఉంది.
# మరియ
యేసు తల్లి పేరు కూడా మరియ. అయితే ఈమె వేరే స్త్రీ.
# ఈ రోగం మరణానికి ముగింపు కాదు
దీనిని "ఈ వ్యాధికి తుది ఫలితం మరణం కాదు" లేదా "లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, కానీ ఈ రోగం తుది ఫలితం మరణం కాదు" అని కూడా అనువదించవచ్చు. లాజరు చనిపోడు అని యేసు శిష్యులు భావించారు. కానీ యేసుకు తెలుసు, లాజరు అనారోగ్యంతో చనిపోయినప్పటికీ, చివరికి అతను బతుకుతాడని.
# ఇది దేవుని మహిమ కొరకు
అంటే, "దేవుడు ఎంత గొప్పవాడో అని ప్రజలు తెలుసుకొని స్తుతించడానికి ఇది కారణమవుతుంది."
# కానీ ఆయన రెండు రోజులు ఎక్కడ ఉన్నాడో,అక్కడే ఉండిపోయాడు
దీనిని ఇలా అనువదించవచ్చు, "లాజరును ఆయన స్వస్థపరచాలని వారు కోరుకున్నప్పటికీ, ఆయన రెండు రోజులు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండిపోయాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/lazarus]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/kt/glory]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/love]]