te_obs-tn/content/27/11.md

33 lines
2.7 KiB
Markdown

# ధర్మశాస్త్ర నిపుణుడు
అంటే, “యూదా ధర్మశాస్త్రంలో ఒక నిపుణుడు.” ఈ పదాన్ని [27:01](27/01) చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.
# ముగ్గురు వ్యక్తులు
ఈ ముగ్గురు వ్యక్తులు యాజకుడు, లేవీయుడు, సమరయుడు.
# పొరుగువాడు
[27:02](27/02) చట్రంలో ఉన్న దానికంటే ఒక విశాల దృక్ఫథంలో యేసు “పొరుగువాడు” అనే పదాన్ని వినియోగిస్తున్నాడు. ఇక్కడ “పొరుగువాడు” అనే పదం మన సహాయం అవసరమైన ప్రతీవానిని సూచిస్తుంది.
# పొరుగువాడై యున్నాడు.
ఈ వాక్యం “పొరుగువాడుగా ప్రవర్తించాడు” లేక “స్నేహితుడిగా ఉన్నాడు” లేక “ఒక ప్రేమగల విధానంలో సహాయం చేసాడు” అని అనువదించవచ్చు. “పొరుగువాడు” అనే పదం [27:02](27/02) చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.
# నీవు వెళ్ళు, ఆలా చెయ్యి
అంటే, “నీవు కూడా వెళ్ళాలి, ఆవిధంగా చెయ్యాలి” లేక “ఇప్పుడు నీవు ఖచ్చితంగా చెయ్యాలి” అని అర్థం. సమరయుడు చేసిన విధంగా ధర్మశాస్త్ర బోధకుడు కూడా చెయ్యాలని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు.
# అదే చెయ్యి
అంటే, “ఇతరులను ప్రేమించు, మీ శత్రువులను సహితం ప్రేమించు.” గాయపడిన వ్యక్తికి సహాయం చెయ్యడాన్ని మాత్రమే సూచించేలా ఉండకుండా చూడండి.
# ..నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/mercy]]