te_obs-tn/content/27/02.md

3.5 KiB

ధర్మ శాస్త్ర నిపుణుడు

అంటే, “యూదా ధర్మశాస్త్రంలో ఒక నిపుణుడు.” ఈ పదాన్ని 27:01 చట్రంలో ఏ విధంగా అనువదించారో చూడండి.”

నీ ప్రభువైన దేవుణ్ణి ప్రేమించాలి

“మన ప్రభువైన దేవుణ్ణి మనం ప్రేమించాలి” అని చెప్పవచ్చు. ఈ వ్యక్తి యేసును ఆజ్ఞాపిస్తున్నట్టు కనిపించేలా చూడండి. దానికి బదులు దేవుని ధర్మశాస్త్రం మనుష్యులు ఏమి చెయ్యాలని ఆజ్ఞాపిస్తుందో అతడు చెపుతున్నాడు.

నీ పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో

అంటే, “మీ పూర్తి ఆత్మతో” లేక “నీలోని ప్రతీ భాగంతో.” కొన్ని భాషలలో దీనిని “మీ పూర్తి కాలేయంతో, శ్వాసతో, బలంతో, ఆలోచనలతో” అని అనువదించవచ్చు. ఈ భాగాల మీద లక్ష్యముంచడం కాదు కాని మనలో ఉన్న అన్నిటిమీద. మీ భాషలో పూర్తి వ్యక్తిని సూచించే కీలక అంశాలను వినియోగించండి.

హృదయం

హృదయం ఒక వ్యక్తిలోని కోరికలూ, ఉద్రేకాలను సూచించే ఒక భాగం

ప్రాణం

ఒక వ్యక్తిలోని భౌతికం కాని ఆత్మీయ భాగాన్ని సూచిస్తుంది.

బలం

భౌతిక దేహం, దానిలోని అన్ని సామర్ధ్యాలను బలం సూచిస్తుంది

మనసు

ఒక వ్యక్తి ఆలోచించడం, ప్రణాళికలు చెయ్యడం, అభిప్రాయాలను కలిగియుండే భాగాన్ని మనసు సూచిస్తుంది

పొరుగువాడు

“పొరుగువాడు” పదం సాధారణంగా మనకు సమీపంగా నివసించే వ్యక్తిని సూచిస్తుంది. యూదులు ఈ పదాన్ని తమకు దగ్గరి బంధువు, లేక విదేశీయుడు, లేక శత్రువుకు తప్ప మిగతా వారికి అన్వయిస్తారు.

నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు

అంటే, “నిన్ను నీవు ప్రేమించే స్థాయిలో నీ పొరుగువాడిని ప్రేమించు.”

అనువాదం పదాలు