te_obs-tn/content/24/04.md

40 lines
2.9 KiB
Markdown

# మీరు విషపూరిత సర్పాలు
ఈ పదాన్ని “మీరు విషపూరిత సర్పాల్లా ఉన్నారు!” అని అనువదించవచ్చు. యోహాను వారిని విషసర్పాలు అని పిలిస్తున్నాడు, ఎందుకంటే వారు ప్రమాదకరంగా ఉన్నారు, మోసపూరితంగా ఉన్నారు.
# మంచి ఫలం ఫలించని ప్రతీ చెట్టు
యోహాను చెట్ల గురించి మాట్లాడడం లేదు. మంచి చెట్టు దేవుని నుండి వచ్చే మంచి క్రియలూ, మంచి వైఖరులతో సరిపోల్చే వాక్యం ఇది.
# అవి నరకబడి అగ్నిలో త్రోయబడతాయి.
దీని అర్థం, “అవి దేవునిచేత తీర్పు తీర్చబడతాయి, శిక్షించబడతాయి.”
# యోహాను నెరవేర్చాడు
అంటే దేవుని సందేశకుడు ఇలా చేస్తాడని ప్రవక్త చెప్పిన దానిని “యోహాను చేస్తున్నాడు.”
# చూడండి
దీనిని “దృష్టి నిలపండి, చూడండి” లేక “గమనాన్ని నిలపండి” అని అనువాదం చెయ్యవచ్చు
# నా సందేశకుడు
అంటే “నేను యెహోవాను నా సందేశకుడిని పంపిస్తాను.” కొన్ని భాషలలో ఈ వాక్యం పరోక్షంగా వినియోగించడం మరింత సహజంగా ఉంటుంది. “దేవుడు తన సందేశకుడిని పంపుతాడని ప్రవక్త అయిన యెషయా ముందుగా చెప్పినట్లుగా” అని అనువదించవచ్చు.
# నీకు ముందుగా
ఈ వాక్యంలో “నీకు” అనే పదం మెస్సీయను సూచిస్తుంది
# నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు
దేవుని సందేశకుడు ప్రజలు మెస్సీయ మాటలు వినేలా వారిని సిద్ధపరుస్తాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
* [[rc://*/tw/dict/bible/kt/repent]]
* [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]