te_obs-tn/content/20/11.md

27 lines
2.2 KiB
Markdown

# డెబ్బది సంవత్సరాల తరువాత
బబులోను సైన్యం యెరూషలేం ప్రజలను చెరలోనికి తీసుకొనివెళ్ళిన తరువాత డెబ్బది సంవత్సరాలను ఇది సూచిస్తుంది.
# కోరేషు
కోరేషును “ఘనుడైన కోరేషు” అని పిలిచారు. “కోరేషు” అనే పేరు అర్థం పాలస్తీనా భాషలో “సూర్యుని వలే.” కోరేషు చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ పేరు అర్థానికి బదులు అతని పేరును అనువదించడం మంచిదిగా ఉండవచ్చు.
# పర్షియనులు
మధ్య ఆసియానుండి ఐగుప్తు వరకూ ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోడానికి పర్షియను సామ్రాజ్యం వృద్ధి చెందింది. ఆధునిక ఇరాన్ ప్రాంతంలో దాని ముఖ్యకేంద్రం ఉంది.
# ఇశ్రాయేలీయులను ఇప్పుడు యూదులు అని పిలుస్తున్నారు
ఈ వాక్యాన్ని “ప్రజలు ఇశ్రాయేలీయులను ఇప్పుడు “యూదులు” అని పిలుస్తున్నారు అని తర్జుమా చెయ్యవచ్చు.
# యూదా ప్రాంతం
అంటే, ప్రవాసానికి ముందు యూదా రాజ్యం ఉన్న ప్రాంతం. యూదా రాజ్యానికి యెరూషలేం ముఖ్యపట్టణం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/king]]
* [[rc://*/tw/dict/bible/other/babylon]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/jew]]