te_obs-tn/content/16/05.md

2.1 KiB

ఒకరోజు

ఈ పదం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే నిర్దిష్టమైన సమయాన్ని చెప్పడం లేదు. అనేక భాషలు ఒక నిజమైన కథను ఆరంభించదానికి అదే విధానాన్ని కలిగియున్నాయి.

విత్తనాలను దుళ్ళగొట్టుచున్నాడు

ఆ విత్తనాలు గోధుమలు. అనేక చిన్న విత్తనాలలో, ధాన్యాలలో ఇవి ముఖ్యమైనవి. వాటికి సన్నని కాడలు ఉంటాయి. “దుళ్ళగొట్టడం” అంటే మొక్కల విత్తనాలను వాటి కాడలనుండి విత్తనాల పైభాగంలో కొట్టడం ద్వారా వాటిని వేరుచేయ్యడం. ఈ విత్తనాలు ఆహారం. కాడలు ఆహారం కాదు.

రహస్యంగా

గిద్యోను రహస్య స్థలంలో మిద్యానీయులకు కనిపించకుండా విత్తనాలను దుళ్ళగొడుతున్నాడు,

దేవుడు నీతో ఉన్నాడు

దీని అర్థం, “దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో నీతో ఉన్నాడు” లేక “ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు నిన్ను వాడుకోడానికి ఆయన ప్రణాళికలను కలిగియున్నాడు.”

అనువాదం పదాలు