te_tN/tn_3JN.tsv

26 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:introkwv90

3 యోహాను రాసిన పత్రిక పరిచయం

భాగం 1: సాధారణ పరిచయం

3 యోహాను పత్రిక రూపురేఖలు. పరిచయం (1:1)

  1. ఆతిథ్యాన్ని చూపించడానికి ప్రోత్సాహం, హెచ్చరికలు(1:2-8)
  2. దియోత్రెఫే, దేమేత్రి (1:9-12) 1.ముగింపు (1:13-14)

3 యోహాను ప్రత్రికను ఎవరు రాశారు?

ఈ ఉత్తరం రచయిత పేరును ఇవ్వడం లేదు. రచయిత తనను తాను పెద్దగా మాత్రమే గుర్తించుకొన్నాడు (1:1). ఈ ఉత్తరాన్ని బహుశా అపొస్తలుడైన యోహాను తన జీవితం చివరిభాగంలో వ్రాశాడు.

3 యోహాను పత్రిక ఏమి చెపుతుంది?

యోహాను ఈ ఉత్తరాన్ని గాయికి అనే విశ్వాసికి రాశాడు. తన ప్రదేశాల ద్వారా ప్రయాణిస్తున్న తోటి విశ్వాసులకు ఆతిథ్యమివ్వాలని యోహాను గాయిని ఆదేశించాడు.

ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?

అనువాదకులు “యోహాను నుండి మూడవ పత్రిక” లేదా “యోహాను రాసిన మూడవ పత్రిక” లాంటి సాంప్రదాయ శీర్షికలతో ఈ పత్రికను పిలువవచ్చు. లేదా “యోహాను నుండి మూడవ పత్రిక” లేదా “యోహాను రాసిన మూడవ పత్రిక” లాంటి స్పష్టమైన శీర్షికను వారు ఎంపిక చేయవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

భాగం 2: ముఖ్యమైన మతపరమైనా, సాంస్కృతిక అంశాలు

ఆతిథ్యం అంటే ఏమిటి?

పురాతన సమీప తూర్పు దేశాలలో ఆతిథ్యం ఒక ముఖ్యమైన అంశం. విదేశీయులు లేదా బయటి వ్యక్తుల పట్ల స్నేహంగా ఉండడమూ, వారికి అవసరమైతే సహాయం అందించడమూ చాలా ముఖ్యం. 2 యోహాను పత్రిక, అబద్ధపు బోధకులకు ఆతిథ్యం చూపించకుండా ఉండేందుకు యోహాను క్రైస్తవులను నిరుత్సాహపరిచాడు. 3 యోహాను పత్రికలో, నమ్మకమైన బోధకులకు ఆతిథ్యం చూపించాలని యోహాను క్రైస్తవులను ప్రోత్సహించాడు

భాగం 3: ముఖ్యమైన అనువాద సమస్యలు

రచయిత తన ఉత్తరంలో కుటుంబ సంబంధాలను ఏవిధంగా ఉపయోగించాడు?

రచయిత సోదరుడు, పిల్లలు పదాలను ఉపయోగించాడు, ఇవి కొంత గందరగోళానికి గురిచేసేవిగా ఉన్నాయి. యూదులను సూచించడానికి లేఖనాలు తరచుగా సోదరులు అనే పదాన్ని ఉపయోగించాయి. అయితే ఈ ఉత్తరంలో క్రైస్తవులను సూచించడానికి యోహాను ఈ పదాన్ని ఉపయోగించాడు. అంతే కాకుండా యోహాను కొంతమంది విశ్వాసులను తన పిల్లలు అని పిలిచాడు. వీరు క్రీస్తుకు విధేయత చూపాలని తాను బోధించిన విశ్వాసులు.

యోహాను అన్యజనులు అనే పదాన్ని గందరగోళానికి గురిచేసే విధంగా ఉపయోగించాడు. యూదులు కాని వ్యక్తులను సూచించడానికి లేఖనాలు తరచుగా అన్యజనులు అనే పదాన్ని ఉపయోగించాయి. అయితే ఈ ఉత్తరంలో, యేసును విశ్వసించని వారిని సూచించడానికి యోహాను ఈ పదాన్ని ఉపయోగించాడు.

31:1rni7rc://*/ta/man/translate/figs-youGeneral Information:0

General Information:

ఇది యోహాను గాయికి రాసిన వ్యక్తిగత లేఖ. నీవు, నీ అని రాసిన అన్ని సందర్భాలు గాయిని సూచిస్తున్నాయి, అవి ఏకవచనం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])

41:1w99trc://*/ta/man/translate/figs-explicitὁ πρεσβύτερος1

ఇది యేసు అపొస్తలుడు మరియు శిష్యుడైన యోహానును సూచిస్తుంది. అతను తన వృద్ధాప్యం కారణంగా లేదా సంఘంలో నాయకుడు కావడం వలన తనను తాను పెద్ద అని సూచిస్తున్నాడు. రచయిత పేరు స్పష్టంగా చెప్పవచ్చు: “నేను, పెద్దనైన యోహాను, వ్రాస్తున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])

51:1lls6rc://*/ta/man/translate/translate-namesΓαΐῳ1

యోహాను ఈ ఉత్తరాన్ని రాస్తున్న ఇతను తోటి విశ్వాసి. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

61:1mp9wὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ1

"నేను నిజంగా ప్రేమిస్తున్నాను"

71:2v6dvπερὶ πάντων & σε εὐοδοῦσθαι καὶ ὑγιαίνειν1

నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి, మరియు ఆరోగ్యంగా ఉండాలి”

81:2i269καθὼς εὐοδοῦταί σου ἡ ψυχή1

“నీవు ఆత్మీయంగా ఆరోగ్యవంతుడివిగా ఉన్నట్టుగానే”

91:3b4zhἐρχομένων ἀδελφῶν1

“తోటి విశ్వాసులు వచ్చినప్పుడు” ఈ ప్రజలు అందరూ బహుశా పురుషులై ఉంటారు.

101:3y7q3rc://*/ta/man/translate/figs-metaphorσὺ ἐν ἀληθείᾳ περιπατεῖς1

ఒక మార్గంలో నడవడం ఒక వ్యక్తి తన జీవితాన్ని ఏవిధంగా జీవిస్తున్నాడనేదానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: “నీవు దేవుని సత్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని జీవిస్తున్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

111:4w79mrc://*/ta/man/translate/figs-metaphorτὰ ἐμὰ τέκνα1

యేసునందు విశ్వాసం ఉంచడానికి తాను బోధించిన వారు తన పిల్లలుగా యోహాను మాట్లాడుతున్నాడు. ఇది వారి పట్ల ఆయనకున్న ప్రేమనూ, ఆసక్తినీ నొక్కి చెపుతుంది. తానే వారిని ప్రభువు వద్దకు నడిపించాడని కూడా చెపుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నా ఆత్మీయ పిల్లలు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

121:5vl13Connecting Statement:0

Connecting Statement:

దేవుణ్ణి సేవించడానికి ప్రయాణం చేస్తున్న ప్రజలను గురించిన శ్రద్ధ తీసుకోవాలని గాయికి ఆదేశించడం ఈ ఉత్తరం రాయడంలో యోహాను యొక్క ఉద్దేశ్యం. తరువాత అతడు ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు, ఒకరు దుష్టుడైన వ్యక్తి, మరొకరు మంచి వ్యక్తి.

131:5tmh1ἀγαπητέ1

ఇక్కడ ప్రియమైన పదం ఒక తోటి విశ్వాసిగా గాయి కోసం తన ప్రేమను చూపించడం కోసం ఉపయోగించబడింది. మీ భాషలో ప్రియమైన స్నేహితుడు కోసం ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించండి.

141:5gs6xπιστὸν ποιεῖς1

“మీరు దేవునికి నమ్మకమైనదానిని చేస్తున్నారు” లేదా “మీరు దేవునికి స్వామిభక్తితో ఉన్నారు”

151:5g4gzὃ, ἐὰν ἐργάσῃ εἰς τοὺς ἀδελφοὺς καὶ τοῦτο ξένους1

"మీరు తోటి విశ్వాసులకు సహాయం చేసినప్పుడు, ముఖ్యంగా మీకు తెలియని వారికి"

161:6wzf6οἳ ἐμαρτύρησάν σου τῇ ἀγάπῃ ἐνώπιον ἐκκλησίας1

ఈ పదాలు అపరిచితులను గురించి వివరిస్తున్నాయి (5 వ వచనం). "అపరిచితులైన వారిని నీవు ఏవిధంగా ప్రేమించావో సంఘంలోని విశ్వాసులకు చెప్పారు”

171:6pb64καλῶς ποιήσεις, προπέμψας1

ప్రయాణిస్తున్న విశ్వాసులకు సహాయం చేయడంలో గాయి యొక్క సహజ అభ్యాసం విషయంలో యోహాను అతనిని అభినందిస్తున్నాడు. ఇది గాయి నిరంతరం చేసే పని అని చూపించే విధంగా దీనిని అనువదించండి.

181:7d8y1rc://*/ta/man/translate/figs-metonymyγὰρ τοῦ ὀνόματος ἐξῆλθον1

ఇక్కడ పేరు పదం యేసును సూచిస్తుంది. దీని అర్థం: (1) యేసు గురించి ఇతరులకు చెప్పడానికి వారు ఉన్న చోటనుండి బయలుదేరారు, లేదా (2) వారు ఉన్న చోటునుండి బయలుదేరారు ఎందుకంటే వారు యేసును విశ్వసించినందుచేత వారు విడిచి వెళ్ళాలని వారిని బలవంతం చేశారు. లేదా (3) ఈ రెండూ విషయాలు. ప్రత్యామ్నాయ అనువాదం: “వారు యేసును గురించి ప్రజలకు చెప్పడానికి బయలుదేరినప్పటి నుండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy ]])

191:7yzc8μηδὲν λαμβάνοντες1

(1) అవిశ్వాసులు వారికి ఏదైనా ఇచ్చి వారికి సహాయం చేయలేదు లేదా (2) అవిశ్వాసుల నుండి ఎటువంటి సహాయం లేదా కానుకలూ అంగీకరించలేదు అని దీని అర్థం కావచ్చు.

201:7hk3pτῶν ἐθνικῶν1

ఇక్కడ అన్యజనులు అంటే కేవలం యూదులుకాని వారు మాత్రమే అని కాదు. యేసు నందు విశ్వాసం ఉంచని ఎటువంటి ప్రజలైనా కావచ్చు.

211:8d2l7ἵνα συνεργοὶ γινώμεθα τῇ ἀληθείᾳ1

"తద్వారా ప్రజలకు దేవుని సత్యాన్ని ప్రకటించడంలో మనం వారికి సహకరిస్తాము"

221:8ab01rc://*/ta/man/translate/figs-personificationτῇ ἀληθείᾳ1

యోహాను, గాయి, ఇతరులు ఒక వ్యక్తికోసం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ “సత్యం” చెప్పబడింది. దీని అర్థం (1) UST లో ఉన్నట్లుగా “దేవుని నుండి వచ్చిన సత్య సందేశం” లేదా దీని అర్థం (2) “సత్యం అయిన దేవుడు”. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])

231:9tm9qτῇ ἐκκλησίᾳ1

సంఘం పదం గాయినీ, దేవుణ్ణి ఆరాధించడానికి కలిసి విశ్వాసుల గుంపునూ సూచిస్తుంది.

241:9cz9drc://*/ta/man/translate/translate-namesΔιοτρέφης1

అతను సంఘం ఒక సభ్యుడు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

251:9s82wὁ φιλοπρωτεύων αὐτῶν1

“వారి మధ్య అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడేవాడు” లేదా “అతను వారి నాయకుడిగా వ్యవహరించడానికి ఇష్టపడేవాడు”

261:9dp1vrc://*/ta/man/translate/figs-exclusiveἡμᾶς1

మమ్ములను పదం ప్రత్యేకమైనది; ఇది యోహానునూ, అతనితో పాటు ఉన్నవారినీ సూచిస్తుంది. దీనిలో గాయి లేదు. యోహాను తనను తాను సూచించుకోవడం కూడా మర్యాదపూర్వక మార్గం కావచ్చు. UST చూడండి. (చూడండి: \ [\ [rc: //te/ ta / man / translate / figs -lusive ]])

271:9rrggrc://*/ta/man/translate/figs-metonymy0

దియోత్రెఫే మమ్ములను అంగీకరించడం లేదు, అంటే యోహానునీ, యోహానుతో ఉన్నవారినీ భౌతికంగా తిరస్కరించాడు అని కాదు. అయితే అతడు యోహాను అధికారాన్ని లేదా హెచ్చరికలను అంగీకరించడం లేదని చెప్పాడానికి ఇది క్లుప్త మార్గం. UST చూడండి. (చూడండి:[[rc://te/ta/man / translate / figs-metonymy ]])

281:10f6qjλόγοις πονηροῖς φλυαρῶν ἡμᾶς1

"అంటే, అతడు మమ్మును గురించి చెడు విషయాలు చెపుతున్నాడు, ఖచ్చితంగా అవి నిజం కాదని చెప్పాడు"

291:10wi6aαὐτὸς ἐπιδέχεται τοὺς ἀδελφοὺς1

"తోటి విశ్వాసులను స్వాగతించడం లేదు"

301:10it7prc://*/ta/man/translate/figs-ellipsisτοὺς βουλομένους κωλύει1

ఇక్కడ పదాలు ఇంకా మిగిలే ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అవుతాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “విశ్వాసులను స్వాగతించాలనుకునే వారిని అతడు నిలువరిస్తున్నాడు” UST చూడండి. (చూడండి: \ [\ [rc: //te/ ta / man / translate / figs-ellipsis ] ])

311:10g98bἐκ τῆς ἐκκλησίας ἐκβάλλει1

"విశ్వాసుల సమూహాన్ని విడిచిపెట్టమని అతడు వారిని బలవంతం చేస్తున్నాడు"

321:11a3z8ἀγαπητέ1

ఇక్కడ ప్రియమైన పదం తోటి విశ్వాసిగా గాయి కోసం ఒక ప్రియమైన పదంగా ఉపయోగించబడింది. [3 యోహాను 1:5] (../01/05.md) లో మీరు దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.

331:11pv24μὴ μιμοῦ τὸ κακὸν1

"ప్రజలు చేసే చెడు పనులను అనుకరించవద్దు"

341:11sz2hrc://*/ta/man/translate/figs-ellipsisἀλλὰ τὸ ἀγαθόν1

ఇక్కడ పదాలు ఇంకా మిగిలి ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అవుతాయి. . ప్రత్యామ్నాయ అనువాదం: “అయితే ప్రజలు చేసే మంచి పనులను అనుకరించండి.” UST చూడండి. (చూడండి: \ [\ [rc: //te/ ta / man / translate / figs-ellipsis ] ])

351:11cm8tἐκ τοῦ Θεοῦ ἐστιν1

“దేవుని నుండి వచ్చేవి”

361:11zan2rc://*/ta/man/translate/figs-metaphorοὐχ ἑώρακεν τὸν Θεόν1

ఇక్కడ “చూడటం” పదం తెలుసుకోవడం లేదా అర్థం చేసుకోవడం కోసం ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుణ్ణి తెలుసుకోలేదు” లేదా “దేవుణ్ణి విశ్వసించలేదు” UST కూడా చూడండి. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor ]])

371:12pl7irc://*/ta/man/translate/figs-activepassiveΔημητρίῳ μεμαρτύρηται ὑπὸ πάντων1

దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేమేత్రి గురించి తెలిసిన వారందరూ అతని గురించి సాక్ష్యమిస్తారు” లేదా “దేమేత్రి గురించి తెలిసిన ప్రతి విశ్వాసి అతని గురించి మంచి సంగతులు చెపుతున్నారు.” UST చూడండి. (చూడండి:[[rc: //te/ta/man/translate/figs-activepassive]])

381:12m22hrc://*/ta/man/translate/translate-namesΔημητρίῳ1

యోహాను తాను దర్శించడానికి వచ్చినప్పుడు గాయి, మరియు సంఘం ఆహ్వానించాలని యోహాను కోరుకొన్న వ్యక్తి ఇతడు కావచ్చు. అతడు ఈ ఉత్తరాన్ని అందచేసిన వ్యక్తి కావచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

391:12rad4rc://*/ta/man/translate/figs-personificationὑπὸ αὐτῆς τῆς ἀληθείας1

"సత్యం కూడా అతని గురించి మంచి విషయాలు మాట్లాడుతుంది." ఇక్కడ సత్యం ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా వర్ణించబడింది. ఇక్కడ సత్యం “దేవుని నుండి వచ్చిన సత్యమైన సందేశాన్ని” సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యం తెలిసిన ప్రతి ఒక్కరూ అతడు మంచి వ్యక్తి అని యెరుగుదురు.” UST కూడా చూడండి. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-personification]])

401:12mftmrc://*/ta/man/translate/figs-ellipsis0

ఈ ఉపవాక్యం నుండి పదాలు మిగిలి ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అయ్యాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు అతడు సత్యం వలన సాక్ష్యం పొందాడు.” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-ellipsis]])

411:12s712rc://*/ta/man/translate/figs-explicitκαὶ ἡμεῖς δὲ μαρτυροῦμεν1

యోహాను ధృవీకరిస్తున్నది ఇక్కడ సూచించబడింది, స్పష్టంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు మేము కూడా దేమేత్రి గురించి మంచివాడని మాట్లాడుతున్నాము.” UST కూడా చూడండి. (చూడండి:[[rc://te/ta/man/అనువాదం/ figs-explicit]])

421:12a16arc://*/ta/man/translate/figs-exclusiveἡμεῖς1

ఇక్కడ మేము పదం యోహానునూ, అతనితో ఉన్నవారందరినీ సూచిస్తుంది, గాయిని చేర్చలేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])

431:13v27cGeneral Information:0

General Information:

యోహాను గాయికి రాసిన ఉత్తరానికి ఇది ముగింపు. ఈ విభాగంలో, యోహాను గాయిని చూడటానికి వస్తున్నట్లు ప్రస్తావించాడు, మరియు అభివందనాలతో ముగిస్తున్నాడు.

441:13am6krc://*/ta/man/translate/figs-doubletοὐ θέλω διὰ μέλανος καὶ καλάμου σοι γράφειν1

ఇది జంటపదం. ఎందుకంటే సిరా మరియు పెన్ను ఇప్పటికే పేర్కొన్న వ్రాత ప్రక్రియను సూచిస్తుంది. సిరా మరియు పెన్ను కాకుండా వేరే వాటితో వ్రాస్తానని యోహాను చెప్పడం లేదు. ఈ ఇతర విషయాలు రాయడానికి తాను ఇష్టపడనని చెప్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను వాటి గురించి మీకు వ్రాయడానికి ఇష్టపడను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])

451:14r8i4rc://*/ta/man/translate/figs-idiomστόμα πρὸς στόμα1

ఇక్కడ నోటి నుండి నోటికి వాక్యం ఒక జాతీయం. అంటే “వ్యక్తిగతంగా” అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: “వ్యక్తిగతంగా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])

461:15v8yjεἰρήνη σοι1

"దేవుడు మీకు శాంతిని ఇస్తాడు గాక"

471:15mhs1ἀσπάζονταί σε οἱ φίλοι1

"ఇక్కడి విశ్వాసులు మీకు అభివందనాలు తెలియచేస్తున్నారు"

481:15lq8rἀσπάζου τοὺς φίλους κατ’ ὄνομα1

"అక్కడ ఉన్న విశ్వాసులలో ప్రతి ఒక్కరికీ మా అభివందనాలు తెలియచెయ్యండి"