te_tw/bible/other/watch.md

4.0 KiB
Raw Permalink Blame History

చూడు, కావలి, కాపాడు, శ్రద్ధ వహించు, జాగ్రత్త

నిర్వచనము:

“చూడు” అనే పదమునకు దేనినైనా చాలా దగ్గరగాను మరియు జాగ్రత్తగాను చూచుట అని అర్థము. దీనికి అనేకమైన అలంకారిక అర్థములు కలవు. “కాపలాదారుడు” అనగా ఒక పట్టణములోని ప్రజలకు ఎటువంటి అపాయము కలుగకుండ లేక ఆపద సంభవించకుండ ఉండునట్లు వారిని కాయుటకు ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా ఆ పట్టణమంతా తిరుగుతూ చేసే ఉద్యోగమైయున్నది.

  • “నీ జీవితమును మరియు సిద్ధాంతమును చాలా దగ్గరిగా చూచుకొనుము” అనే ఆజ్ఞకు అర్థము ఏమనగా జ్ఞానముగా చాలా జాగ్రత్తగా జీవించు మరియు తప్పుడు బోధనలను ఏ మాత్రము నమ్మవద్దు అని దాని అర్థము.
  • “మెలకువ కలిగియుండు” అనగా అపాయమును లేక హానికరమైన ప్రభావము ఎంతమాత్రమూ పడకుండా జాగ్రత్తగా ఉండు అని అర్థము.
  • “చూడు” లేక “చూస్తూ ఉండు” అనగా ఎల్లప్పుడూ పాపమునకు మరియు దుష్టత్వమునకు విరుద్ధముగా పోరాడుటకు జాగ్రత్తగా ఉండు మరియు భద్రముగా ఉండు అని అర్థము. “సిద్ధముగా ఉండు” అనే అర్థము కూడా వస్తుంది.
  • “కాపలా కాస్తూ ఉండడం” లేక “చాలా దగ్గరిగా చూడడం” అనే ఈ మాటలకు ఎవరినైనా లేదా దేనినైనా కాయడం, సంరక్షించడం లేక జాగ్రత్త తీసుకోవడం అని అర్థము.
  • “చూడు” అనే పదమును తర్జుమా చేయు ఇతర విధానములలో “ఎక్కువ శ్రద్ధకలిగియుండు” లేక “శ్రద్ధాసక్తుడవైయుండు” లేక “జాగ్రత్తగా కాపలా కాయు” లేక “భద్రత కలిగియుండు” అని కూడా ఉపయోగించి తర్జుమా చేయుదురు.
  • “కాపలాదారుడు” అనే పదానికి “కావలివాడు” లేక “కాపుకాయువాడు” అని కూడా ఉపయోగించుదురు.

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0821, H2370, H4929, H4931, H5027, H5341, H6486, H6822, H6836, H6974, H7462, H7789, H7919, H8104, H8108, H8245, G00690, G09910, G11270, G14920, G23340, G28920, G35250, G37080, G39060, G43370, G46480, G50830, G54380