te_tw/bible/other/sex.md

4.7 KiB

కఠినమైన సంబంధాలు, ప్రేమించడం, పడుకోవడం, పడుకోబెట్టును, పడుకొనెను, పడుకొనియుండుట

నిర్వచనము:

పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు లేక పదాలన్నియు లైంగిక సంబందాలు కలిగియుండుటను సూచించే సభ్యోక్తులైయున్నవి. (చూడండి: సభ్యోక్తి)

  • “ఎవరితోనైనా “పడుకో” అనే ఈ మాట సాధారణముగా పడుకొనే వ్యక్తితో లైంగిక సంబంధాలను కలిగియుండుటను సూచించును. ఈ పదానికి “పడుకొనెను” అనే మాట భూతకాల పదమైయుండును.
  • పాత నిబంధన పుస్తకమైన “పరమగీతములు” అనే పుస్తకములో యుఎల్బి బైబిలునందు “ప్రేమ” అనే పదమును తర్జుమా చేయుటకు “ప్రేమించుట” అనే పదమును ఉపయోగించడమైనది, అయితే అక్కడ సందర్భములో లైంగిక సంబంధాలను సూచించుటకు వాడబడింది. ఈ మాట లేక పదము “ప్రేమను పంచు” అనే మాటకు సంబంధించింది.

తర్జుమా సలహాలు:

  • కొన్ని భాషలలో ఈ పదాలన్నిటి కొరకు వివిధ సందర్భాలలో వివిధమైన మాటలను ఉపయొగిస్తూ ఉండవచ్చును, అయితే పెళ్లి చేసుకున్నవారికైనా లేక ఇతర వేరే సంబంధాలను కలిగియున్నవారికైనా సందర్భాన్ని బట్టి ఉపయోగించుదురు. ఈ పదానికి చేసే తర్జుమా ప్రతి సందర్భములోనూ సరియైనదిగా ఉండునట్లు చూసుకోవడము చాలా ప్రాముఖ్యము.
  • సందర్భానుసారముగా ఈ మాటలన్నిటిని “పడుకో” “పండుకొనుట” లేక “ప్రేమను పంచు” లేక “సంబంధము కలిగియుండు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “సంబంధాలను కలిగియుండుట” అనే ఈ మాటను తర్జుమా చేయు విధానములో “లైంగిక సంబంధాలను కలిగియుండుట” లేక “వివాహ సంబంధాలను కలిగియుండుట” అనే మాటలను కూడా చేర్చుదురు.
  • “ప్రేమించుట” అనే ఈ మాటను “ప్రేమను కలిగియుండుట” లేక “సంబంధము కలిగియుండుట” అని కూడా తర్జుమా చేయుదురు. లేక అనువాద భాషలో ఈ మాటను తర్జుమా చేయుటకు స్వాభావిక విధానములో ఉపయోగించే మాట ఉండవచ్చు.
  • ఈ ఉద్దేశమును తర్జుమా చేయుటకు ఉపయోగించబడిన ఈ మాటలన్నియు బైబిలు తర్జుమా ఉపయోగించే ప్రజలకు అంగీకారముగా ఉన్నాయో లేదో పరిశీలన చేయుట చాలామంచిది.

(ఈ పదములను కూడా చూడండి: లైంగిక అనైతికత)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H160, H935, H1540, H2181, H2233, H3045, H3212, H6172, H7250, H7901, H7903, G1097