te_tw/bible/other/reward.md

3.6 KiB
Raw Permalink Blame History

ప్రతిఫలము, బహుమతి, అర్హమగు

నిర్వచనము:

“ప్రతిఫలము” అనే ఈ పదము ఒక వ్యక్తి చేసిన మంచి పనులకైన లేక చెడు పనులకైన పొందుకొనే వాటిని సూచిస్తుంది. ఒకరికి “ప్రతిఫలము” ఇవ్వడము అనగా అతను పొందదగినవాటిని అతనికి ఇవ్వడము అని దాని అర్థము.

  • ఒక వ్యక్తి పొందుకొనేది మంచిదైయుండవచ్చు లేక అనుకూలమైన విషయమేదైనా ఉండవచ్చు ఎందుకంటే అతను మంచివాటిని చేసియున్నాడు లేక అతను దేవునికి విధేయత చూపియున్నాడు.
  • కొన్నిమార్లు చెడు ప్రవర్తనను బట్టి ప్రతిఫలము అనానుకూలమైన విషయాలను కూడా సూచిస్తుంది, ఉదాహరణకు, “దుష్టత్వపు ప్రతిఫలము” అని చెప్పుకొనవచ్చును. ఈ సందర్భములో చెప్పబడిన “ప్రతిఫలము” వారు తమ పాపభూయిష్టమైన క్రియలను బట్టి వారు పొండుకొనే శిక్ష లేక అనానుకూలమైన పరిణామాలను సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • సందర్భానుసారముగా, “ప్రతిఫలము” అనే ఈ పదమును “వేల చెల్లించుట” లేక “పొందనర్హమైనది” లేక “శిక్ష” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఒకరికి “ప్రతిఫలము” ఇచ్చుట అనే మాటను “వెల చెల్లించుట” లేక “శిక్షించుట” లేక “పొందదగినవాటిని ఇచ్చుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఈ పదమునకు చేసిన తర్జుమా పదము వేతనాలను సూచించకుండునట్లు జాగ్రత్తపడుడి. ప్రతిఫలము అనునది విశేషముగా ఉద్యోగములో భాగముగా డబ్బును సంపాదించే ఉపాది కాదు.

(ఈ పదములను కూడా చూడండి: [శిక్షించు])

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0319, H0866, H0868, H1576, H1578, H1580, H4909, H4991, H5023, H6118, H6468, H6529, H7938, H7939, H7999, G04690, G05140, G05910, G26030, G34050, G34060, G34080