te_tw/bible/other/reject.md

5.0 KiB

తిరస్కరించు, తిరస్కరించబడిన, తిరస్కరణ

నిర్వచనం:

ఎవరినైనా ఒకరిని లేదా ఏదైనా ఒకదానిని “తిరస్కరించడం” అంటే ఆ వ్యక్తినిగాని లేక ఆ వస్తువునుగాని అంగీకరించడానికి నిరాకరించడం అని అర్థం.

·         “తిరస్కరించు” పదం దేనినైనా “విశ్వసించడానికి నిరాకరించడం" అని కూడా అర్థం.

·         దేవునిని తిరస్కరించడం అంటే ఆయనకు లోబడడానికి నిరాకరించడం అనే అర్థం కూడా ఉంది.

·         ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వాన్ని తిరస్కరించినప్పుడు, ఆయన ఆధికారమునకు విరుద్ధముగా వారు తిరుగుబాటు చేసారని చూపిస్తుంది. ఆయనకు వారు లోబడడానికి ఇష్టత చూపించలేదు.

·         ఇశ్రాయేలీయులు అబద్దపు దేవుళ్ళను/దేవతలును పూజించినప్పుడు వారు దేవుణ్ణి తిరస్కరించారని కనుపరచారు.

·         “ప్రక్కకు నెట్టివేయడం" పదం ఈ పదానికి అక్షర అర్థం. దేనినైనా లేక ఎవరినైనా విశ్వసించడానికి నిరాకరించడం లేదా తిరస్కరించడం అని అర్థం ఇచ్చే పదాలు ఇతర భాషలలో ఉండవచ్చు.

అనువాదం సలహాలు :

·         సందర్భాన్ని బట్టి “తిరస్కరించు” అనే పదమును “అంగీకరించకుండా ఉండడం” లేదా “సహాయం చేయడం నిలిపివెయ్యయడం" లేదా “విధేయత చూపుటకు నిరాకరించడం” లేదా “విధేయత చూపించడం నిలిపివెయ్యడం" అని అనువదించవచ్చు.

·         “కట్టువారు నిషేధించిన రాయి” అనే వ్యక్తీకరణ లోని, “నిషేధించిన” అను పదమును “ఉపయోగించుటకు తిరస్కరించిన” లేదా “అంగీకరించ లేదు" లేదా “బయటకు త్రోసివేయబడిన” లేదా “నిరుపయోగమైనదిగా విడిచిపెట్టబడిన" అని అనువదించవచ్చు.

·         దేవుని ఆజ్ఞలను తిరస్కరించిన ప్రజల సందర్భాన్ని బట్టి, తిరస్కరించబడిన అనే పదమును  ఆయన ఆజ్ఞలకు “విధేయత చూపించడానికి నిరాకరించిన” లేదా దేవుని కట్టడలను “అంగీకరించకుండా ఉండడానికి మొండితనంగా ఎంపిక చేసుకోవడం" అని అనువదించవచ్చు.

(చూడండి: ఆజ్ఞఅవిధేయతవిధేయతమెడ వంచని ప్రజలు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0947, H0959, H2186, H2310, H3988, H5006, H5034, H5186, H5203, H5307, H5541, H5800, G01140, G04830, G05500, G05790, G05800, G05930, G06830, G07200, G16090, G38680