te_tw/bible/other/profit.md

5.5 KiB
Raw Permalink Blame History

లాభం, లాభదాయకం, లాభాదాయం కాదు/నిష్ప్రయోజనం

నిర్వచనం:

సాధారణముగా “లాభం," “లాభదాయకం” పదాలు కొన్ని నిర్దిష్టమైన పనులు లేదా ప్రవర్తనలు చేయడం ద్వారా కొంత మంచిని సంపాదించడాన్ని సూచిస్తాయి.

ఏదైనా ఒకటి ఒకరికి మంచివాటిని తీసుకువచ్చినట్లయితే అది వారికి "లాభాదాయకం”, లేదా అది ఇతరులకు మేలు చేయుటకు సహాయ పడుతున్నట్లయితే అది లాభదాయకం.

·         ఇంకా విశేషముగా/నిర్దిష్టంగా “లాభం” అనే పదము తరచుగా వ్యాపారము చేయడం ద్వారా సంపాదించబడిన డబ్బును సూచిస్తుంది. ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ ధనమును సంపాదించగలిగితే ఆ వ్యాపారము “లాభదాయకం.”

·         ప్రజలకు మంచివాటిని తీసుకొచ్చినట్లయితే అవి చర్యలు లాభదాయకం.

·         నీతియందు జనులను శిక్షించుటకు, తప్పు దిద్దుటకు లేఖనములన్నియు “లాభదాయకమైనవి” అని 2 తిమోతి.3:16 వచనము తెలియచేస్తుంది. ప్రజలు దేవుని చిత్త ప్రకారముగా జీవించునట్లు బోధించడం కోసం బైబిలు బోధనలు సహాయకరములు, ఉపయోగకరములు అని ఈ వాక్యం అర్థం.

"లాభదాయకం కాదు/నిష్ప్రయోజనం" అనే పదము ప్రయోజనకరం కాదని అర్థం.

·         ఈ మాట అక్షరాలా దేనికీ ప్రయోజనకరం కాదు, ఎవరూ దేనినీ పొందడానికి సహాయపడదు అని అర్థం.

·         ప్రయోజనకరం కానివి చేయ్యదగినవి కాదు ఎందుకంటే అవి ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు.

·         ఈ పదమును “పనికిరానిది” లేదా “అయోగ్యమైనది” లేదా “ఉపయోగకరముకానిది” లేదా “అనర్హమైనది” లేదా “లాభదాయకం కానిది" లేదా “ఎటువంటి లాభాలను ఇవ్వనిది" అని అనువదించవచ్చు.

(చూడండి: యోగ్యమైనది)

అనువాదం సలహాలు :

·         సందర్భాన్ని బట్టి “లాభం" అనే పదమును "ప్రయోజనం" లేదా "సహాయం" లేదా "సంపాదన" అని అనువదించబడవచ్చు.

·         “లాభదాయకము” అనే పదమును “ఉపయోగకరం” లేదా “ప్రయోజనకరం” లేదా “సహాయకరం" అని అనువదించవచ్చు.

·         దేని "నుండైన లాభం" పొందుట అను పదబంధమును "..నుండి ప్రయోజనం" లేదా "..నుండి డబ్బును సంపాదించడం" లేదా "..నుండి సహాయాన్ని పొందడం" అని అనువదించవచ్చు.

·         వ్యాపార సందర్భంలో, “లాభం" అనే పదమును “డబ్బును సంపాదించుట" లేదా "డబ్బు మిగులు/నిల్వా" లేదా "అదనపు డబ్బు” అని అర్థం వచ్చే పదాలతో అనువదించవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1215, H3148, H3276, H3504, H4195, H4768, H5532, H7737, H7939, G01470, G02550, G05120, G08880, G08890, G08900, G12810, G25850, G27700, G27710, G34080, G42970, G42980, G48510, G55390, G56220, G56230, G56240