te_tw/bible/other/plead.md

2.5 KiB

అభ్యర్ధన, అభ్యర్దించు, సంతోషపెట్టుట, యాచించు, వేడుకొను

వాస్తవాలు:

“అభ్యర్దించు” మరియు “అభ్యర్ధించడం” అనే పదములు ఏదైనా పని చేయుటకు ఎవరినైనా తక్షణమే అడుగుటను సూచిస్తుంది. “అభ్యర్ధన” అనునది తక్షణముగా విన్నవించుకోవడంగా ఉంది.

  • అభ్యర్ధించడం అనునది అనేక పర్యాయాలు ఒక వ్యక్తి చాలా గొప్ప అవసరతలో ఉండుటను లేక సహాయము కొరకు బలముగా అర్థించుటను పరోక్షంగా సూచిస్తుంది.
  • ప్రజలు దేవునిని కనికరముకొరకు లేదా ఏదైనా అనుగ్రహించుటకు, ఇది తమ కొరకైన లేదా ఇతరులకొరకైనా వేడుకొనవచ్చు లేదా అత్యవసర విన్నపము చేయవచ్చు.
  • ఈ పదమును “యాచించుట” లేక “దీనంగా అర్థించుట” లేక “అత్యవసరముగా అడుగుట’ అనే పలు విధాలుగా అనువదించవచ్చు.
  • "అభ్యర్ధన” అనే పదమును “అత్యవసర మనవి” లేక “బలమైన విజ్ఞప్తి” అని కూడా అనువాదం చేయవచ్చు.
  • ఈ పదము డబ్బుల కొరకు యాచించుట అనే అర్థము రాకుండా ఈ సందర్భానికి తగినట్లు స్పష్టముగా ఉండునట్లు జాగ్రత్త వహించండి.

బైబిలు రెఫరెన్సులు:

  • 2 కొరింథీ 08:03-05
  • న్యాయాధిపతులు. 06:31-32
  • లూకా 04:38-39
  • సామెతలు 18:17-18

పదం సమాచారం:

  • Strong's: H1777, H2603, H3198, H4941, H4994, H6279, H6293, H6664, H6419, H7378, H7379, H7775, H8199, H8467, H8469, G11890, G17930, G20650, G38700