6.2 KiB
6.2 KiB
సమాధానం, శాంతియుత, సమాధానపరచువారు
నిర్వచనం:
“సమాధానం” పదం ఎటువంటి సంఘర్షణ, ఆందోళన లేదా భయం లేకుండా ఉండే స్థితినిగానీ లేదా భావనను గానీ సూచిస్తుంది. "శాంతియుతంగా లేదా సమాధానంగా" ఉన్న వ్యక్తి ప్రశాంతంగా భావిస్తాడు, సురక్షితంగానూ, భద్రం గానూ ఉండడం విషయంలో నిశ్చయత కలిగియుంటాడు.
- పాత నిబంధనలో “సమాధానం" పదం తరచుగా ఒక వ్యక్తి క్షేమం, ఆరోగ్యం లేదా సంపూర్ణతల సాధారణ భావాన్ని సూచిస్తుంది.
- "సమాధానం" పదం ప్రజల గుంపులు లేదా దేశాలు ఒకరితో ఒకరు యుద్ధాలు లేకుండా ఉన్న సమయాన్ని కూడా కొన్నిసార్లు సూచిస్తుంది. ప్రజలు "శాంతియుత సంబంధాలు" కలిగియున్నారు అని చెప్పవచ్చు.
- ఒక వ్యక్తితోగానీ లేదా ప్రజల గుంపుతోగానీ “సమాధానపడడం" అంటే యుద్ధాన్ని ఆపగల చర్యలను తీసుకోవడం అని సూచిస్తుంది.
- ఒకరితో ఒకరు సమాధానము కలిగి జీవించడానికి ప్రజలను ప్రభావితం చెయ్యడానికి “సమాధానపరచువాడు” సంగతులు చేస్తాడు మరియు చెపుతాడు.
- ఇతర ప్రజలతో “సమాధానంగా ఉండడం" అంటే ఆ ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యని స్థితిలో ఉండడం అని అర్థం.
- దేవుడు మరియు ప్రజల మధ్య మంచి లేదా సరియైన సంబంధం కేవలం దేవుడు తన ప్రజలను పాపమునుండి విడిపించినప్పుడే ఏర్పడుతుంది. ఇది “దేవునితో సమాధానం” కలిగియుండడం అని పిలువబడుతుంది.
- “కృప మరియు సమాధానం” శుభవచనం తమ తోటి విశ్వాసులకు ఆశీర్వాదంగా తమ ఉత్తరాలలో అపొస్తలులు ఉపయోగించారు.
- "సమాధానం" పదం ఇతర ప్రజలతో గానీ లేదా దేవునితో గానీ మంచి సంబంధంలో ఉండడాన్ని కూడా సూచిస్తుంది.
బైబిలు రిఫరెన్సులు:
- 1 తెస్సా 5:1-3
- అపో.కా 7:26
- కొలస్సీ 1:18-20
- కొలస్సీ 3:15
- గలతీ 5:23
- లూకా 7:50
- లూకా 12:51
- మార్కు 4:39
- మత్తయి 5:9
- మత్తయి 10:13
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- __15:6__కానానులోనున్న ఎటువంటి ప్రజల గుంపుతోనైనా సమాధాన ఒప్పందం చేసుకోవద్దని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.
- 15:12
అప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు దాని సరిహద్దులు ఆన్నిటిలో సమాధానమును అనుగ్రహించాడు.
- __16:3__అప్పుడు దేవుడు ఒక విమోచకుడిని అనుగ్రహించాడు ఆయన వారిని తమ శత్రువులనుండి రక్షించాడు, దేశానికి సమాధానము తీసుకొని వచ్చాడు.
- __21:13__ఆయన (మెస్సీయా) ఇతర ప్రజల పాపం కోసం శిక్షను పొందడానికి చనిపోతాడు. ఆయన మీద పడిన శిక్ష దేవునికీ, మనుష్యులకూ మధ్య సమాధానం తీసుకువచ్చింది.
- __48:14__దావీదు ఇశ్రాయేలుకు రాజై ఉన్నాడు, అయితే యేసు సమస్త విశ్వమునకు రాజుగా ఉన్నాడు. ఆయన మరలా వస్తాడు, మరియు సదాకాలము న్యాయముతోనూ, సమాధానముతోనూ తన రాజ్యమును పరిపాలిస్తాడు.
- 50:17 యేసు సమాధానముతోను మరియు న్యాయముతోనూ తన రాజ్యమును ఏలును, మరియు ఆయన తన ప్రజలతో సదాకాలము ఉండును.
పదం సమాచారం:
- Strong’s: H5117, H7961, H7962, H7965, H7999, H8001, H8002, H8003, H8252, G02690, G15140, G15150, G15160, G15170, G15180, G22720