te_tw/bible/other/palm.md

2.0 KiB

తాటి చెట్టు

నిర్వచనం:

" తాటి చెట్టు" అనే పదం పొడవైన, అనువైన, ఆకులతో కూడిన కొమ్మలను పంకా వంటి నమూనాలో పై నుండి విస్తరించి ఉన్న ఒక రకమైన పొడవైన చెట్టును సూచిస్తుంది.

  • బైబిలులోని తాటి చెట్టు సాధారణంగా “ఖర్జూరపండు” అని పిలువబడే పండ్లను ఉత్పత్తి చేసే ఒక రకమైన తాటి చెట్టును సూచిస్తుంది. ఆకులు ఈక లాంటి నమూనాను కలిగి ఉంటాయి.
  • తాటి చెట్లు సాధారణంగా వేడి, తేమతో కూడిన వాతావరణం ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి. వాటి ఆకులు ఏడాది పొడవునా పచ్చగా ఉంటాయి.
  • యేసు గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు, ప్రజలు ఆయన ముందు నేల మీద తాటి కొమ్మలు వేశారు.
  • తాటి కొమ్మలు సమాధానం మరియు విజయ వేడుకలను సూచిస్తాయి.

(ఇవి కూడా చూడండి: [గాడిద], [యెరూషలేం], [సమాధానం])

బైబిలు రిఫరెన్సులు:

  • [1 రాజులు 6:29-30]
  • [యెహెజ్కేలు 40:14-16]
  • [యోహాను 12:12-13]
  • [సంఖ్యాకాండము 33:9]

పదం సమాచారం:

  • Strong's: H3712, H8558, H8560, H8561, G54040