te_tw/bible/other/mind.md

4.5 KiB
Raw Permalink Blame History

మనసు, మనసుగల, గుర్తు చెయ్యడం, ఏకమనస్కులైన

నిర్వచనం:

“మనసు” అనే పదం ఒక వ్యక్తిలో ఆలోచించే భాగం, నిర్ణయాలు చేసే భాగం.

  • ప్రతీ వ్యక్తి మనసు అతని లేదా ఆమె తలంపులు, ఊహ అంతటి మొత్తం.
  • ”క్రీస్తు మనసు కలిగియుండడం” అంటే యేసు క్రీస్తు ఆలోచించినట్లు, వ్యవహరిస్తున్నట్టు ఆలోచించడం, చెయ్యడం అని అర్థం. తండ్రియైన దేవునికి విధేయుడిగా ఉండడం, క్రీస్తు బోధనలకు లోబడియుండడం అని అర్థం. దీనిని చేయడానికి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శక్తిని పొందడం.
  • ”మనసు మార్చుకోవడం” అంటే ఒకడు తనకు ముందు ఉన్న అభిప్రాయానికి భిన్నంగా భిన్నమైన నిర్ణయాన్ని చెయ్యడం లేక కలిగియుండడం అని అర్థం.

అనువాదం సలహాలు:

  • ”మనసు” అనే పదం “ఆలోచనలు” లేదా “తర్కం” లేదా “ఆలోచించడం” లేదా “అవగాహన చేసుకోవడం” అని అనువదించబడవచ్చు.
  • ”మనసులో ఉంచుకో” అనే వ్యక్తీకరణ “జ్ఞాపకం ఉంచుకో” లేదా “దీని మీద శ్రద్ధ ఉంచు” లేదా “దీనిని తెలుసుకొనేలా ఉండు” అని అనువదించబడవచ్చు.

·         ”హృదయం, ఆత్మ, మనసు” అనే వ్యక్తీకరణ “నీవు భావిస్తున్నదాని గురించీ, నీవు విశ్వసిస్తున్నదాని గురించీ, నువ్వు ఆలోచిస్తున్నదానిని గురించీ" అని అనువదించబడవచ్చు.

  • ”మనసులోనికి తెచ్చుకో” అనే వ్యక్తీకరణ “జ్ఞాపకముంచుకో” లేదా “దాని గురించి ఆలోచించు” అని అనువదించబడవచ్చు.
  • ”మనసు మార్చుకొని వెళ్ళిపోయాడు” అనే వ్యక్తీకరణ “భిన్నంగా నిర్ణయించుకొని వెళ్ళిపోయాడు” లేదా “వెళ్ళిపోడానికి నిర్ణయించుకున్నాడు” లేదా “తన అభిప్రాయాన్ని మార్చుకొని వెళ్ళిపోయాడు” అని అనువదించబడవచ్చు.
  • ”ద్విమనస్కులు” అనే పదం “అనుమానించడం” లేదా “నిర్ణయించుకోలేక పోవడం” లేదా “విరుద్ధమైన తలంపులతో” అని అనువదించబడవచ్చు.

(చూడండి: నమ్మకంహృదయంప్రాణం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3629, H3820, H3824, H5162, H7725, G12710, G13740, G33280, G35250, G35400, G35630, G49930, G55900