te_tw/bible/other/memorialoffering.md

3.0 KiB

జ్ఞాపకార్ధం, జ్ఞాపకార్ధ అర్పణ

నిర్వచనం:

“జ్ఞాపకార్థం” అనే పదం ఎవరినైనా లేక దేనినైనా గుర్తుకు తెచ్చుకోనేలా చేసే చర్యను గానీ లేక వస్తువుగానీ సూచిస్తుంది.

  • ఒక అర్పణలో ”జ్ఞాపకార్థ అర్పణ”లా లేక “జ్ఞాపకార్థ రాళ్ళు” గా ఎవరికైనా దేనినైనా గుర్తుతెచ్చే దానిని వివరించే విశేషణంగా కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు,
  • దేవుడు తమకు చేసినదానిని జ్ఞాపకం చేసుఒదానికి పాతనిబంధనలో జ్ఞాపకార్థ అర్పణలు అర్పించేవారు.
  • దేవుడు ఇశ్రాయేలు యాజకులకు జ్ఞాపకార్థ రాళ్ళు ఉన్న ప్రత్యేక వస్త్రాలను ధరించాలని చెప్పాడు. వాటిమీద ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల పేర్లు చెక్కి ఉంటాయి. దేవుని నమ్మకత్వాన్ని వారికి జ్ఞాపకం చెయ్యడానికి ఇవి ఉన్నాయి.
  • కొత్తనిబంధనలో కోర్నేలి అనే వ్యక్తిని దేవుడు గౌరవించాడు, ఎందుకంటే పేదవారికి ఆయన చేసిన ప్రేమపూరిత కార్యాల వలన దేవుడు జ్ఞాపకముంచుకొన్నాడు. ఈ కార్యాలు దేవుని యెదుట “జ్ఞాపకంగా” చేరాయని రాయబడియుంది.

అనువాదం సూచనలు:

  • ఈ పదాన్ని “నిలిచియుండే జ్ఞాపకం” అని కూడా అనువదించవచ్చు.
  • ఒక “జ్ఞాపకార్థపు రాయి” పదాన్ని “వారికి జ్ఞాపకం చేసే రాయి (దేనిగురించైనా) అని అనువదించవచ్చు.

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2142, H2146, G3422