te_tw/bible/other/mediator.md

2.4 KiB
Raw Permalink Blame History

మధ్యవర్తి

నిర్వచనం:

ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది తమ విబేధాలను లేక సంఘర్షణలను ఒకరికొకరు పరిష్కరించుకొనేలా సహాయం చేసే వ్యక్తిని మధ్యవర్తి అంటారు. వారు సమాధాన పడేలా అతడు సహాయం చేస్తాడు.

  • మనుష్యులు పాపం చేసారు కనుక, వారు దేవుని శత్రువులు, దేవుని ఉగ్రత, శిక్షకు పాత్రులు. పాపం కారణంగా, దేవునికి మనుషులకు మధ్య సంబంధం తెగిపోయింది.
  • దేవునికీ ఆయన ప్రజలకూ మధ్య యేసు మధ్యవర్తిగా ఉన్నాడు, వారి పాపం కోసం తన మరణాన్ని వెలగా చెల్లించడం ద్వారా తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించాడు.

అనువాదం సలహాలు :

  • ”మధ్యవర్తి” అనే పదాన్ని “వ్యక్తుల మధ్యలోనికి వెళ్ళడం” లేక “సమాధానపరచువాడు” లేక “సమాధానాన్ని తెచ్చు వ్యక్తి” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ”యాజకుడు” అనే పదం ఏవిదంగా అనువాదం చెయ్యబడిందో సరిపోల్చండి. “మధ్యవర్తి” అనే పదం భిన్నంగా అనువదించబడడం మంచిది.

(చూడండి: priest, reconcile)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3887, G33120, G33160