te_tw/bible/other/inquire.md

2.5 KiB

విచారణ చేయు, విచారణ చేసిన, విచారణలు

వాస్తవాలు:

"విచారణ చేయు" అంటే ఎవరినైనా సమాచారం కోసం అడుగు. "విచారణ చేయు" అనే మాట దేవుణ్ణి తరచుగా జ్ఞానం, లేక సహాయం కోసం అడగడానికి ఉపయోగిస్తారు.

  • పాత నిబంధనలో ప్రజలు దేవుని దగ్గర విచారణ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
  • దీన్ని రాజు లేదా ప్రభుత్వం అధికారపూర్వకంగా అధికార పత్రాలు చూడడానికి వాడతారు.
  • సందర్భాన్ని బట్టి, "విచారణ చేయు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అడగడం” లేక “సమాచారం సేకరించడం."
  • "యెహోవా వద్ద విచారణ చేయు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యెహోవా నడిపింపు కోసం అడుగు” లేక “ఏమి చెయ్యాలో యెహోవాను అడుగు."
  • "ఒక దాని గురించి విచారణ చేయు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రశ్నలు వేయు” లేక “సమాచారం అడుగు."
  • యెహోవా "నీ చేత నేను విచారణ జరిపించుకోను," అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నీవు నన్ను సమాచారం అడగడానికి అనుమతి ఇవ్వను” లేక “నీవు నా సహాయం కోరే అవకాశం ఇవ్వను."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1240, H1245, H1875, G1830