te_tw/bible/other/hour.md

2.6 KiB
Raw Permalink Blame History

గంట, గంటలు

నిర్వచనం:

కాలాన్ని తెలియజేయడానికి అదనంగా గంట అనే మాటను ఒక చోట జరిగే విషయం, మొదలైన విధాలుగా అలంకారికంగా ఉపయోగిస్తారు:

  • కొన్ని సార్లు "గంట" అనేది ఏదైనా చెయ్యవలసిన నియామక కాలాన్ని సూచిస్తున్నది. "ప్రార్థన గంట."
  • యేసు బాధలు పడి మరణం పొందవలసిన "గంట అయింది" అంటే అందుకోసం నియమించ బడిన సమయం వచ్చింది. అది చాలాకాలం క్రితం దేవుడు నియమించిన సమయం.
  • "గంట" అనే మాటను "ఆ క్షణం” లేక “వెను వెంటనే" అనే అర్థంలో ఉపయోగిస్తారు.
  • "గంట" ఆలస్యం అంటే ఆ రోజుకి పొద్దు పోయింది అని, త్వరలో సూర్యుడు అస్తమిస్తాడు అని అర్థం.

అనువాదం సలహాలు:

  • ఈ మాటను అలంకారికంగా ఉపయోగించినప్పుడు ఇలా అనువదించ వచ్చు. "సమయం” లేక “క్షణం” లేక “నియమించ బడిన సమయం."
  • "అదే గంటలో” లేక “ఆ గంటలోనే" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆ క్షణంలో” లేక “ఆ సమయంలో ” లేక “తక్షణమే” లేక “వెనువెంటనే."
  • "ఆలస్యం గంట" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆ రోజుకి ఆలస్యం అయింది” లేక “త్వరలో చీకటి పడనున్నది” లేక “మధ్యాహ్నం అయిపొయింది."

(చూడండి: hour)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G56100