te_tw/bible/other/forsaken.md

3.9 KiB
Raw Permalink Blame History

విడిచిపెట్టు, విడిచిపెట్టబడిన, విడిచిపెట్టుట

నిర్వచనము

"విడిచిపెట్టు" అనే పదానికి అర్థం ఎవరినైనా వదిలివేయడం లేదా దేనినైనా  వదులుకోవడం. "విడిచిపెట్టబడిన" వ్యక్తి అంటే, వేరొకరిద్వారా వదిలివేయబడిన వాడు.

  • ప్రజలు దేవుడిని "విడిచిపెట్టినప్పుడు", ఆయనకు  అవిధేయత చూపుట ద్వారా నమ్మకద్రోహం చేసారు.
  • దేవుడు ప్రజలను విడిచిపెట్టినప్పుడు, అతను వారికి సహాయం చేయడం మానేసి, వారిని తన వైపు తిరిగేలా చేయడానికి  వారు  బాధలు అనుభవించేలా చేసాడు.
  • ఈ పదం దేవుని బోధనలను విడిచిపెట్టడం లేదా అనుసరించకపోవడం వంటి వాటిని కూడా వదిలివేయడం అని అర్ధం.
  • "అతను మిమ్మల్ని విడిచిపెట్టాడు" లేదా "వదలివేయబడిన" వ్యక్తిని సూచించినట్లుగా, "విడిచిపెట్టబడినది" అనే పదాన్ని భుతకాలంలో ఉపయోగించవచ్చు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని అనువదించడానికి ఇతర మార్గాలు సందర్భాన్ని బట్టి "వదిలిపెట్టడం" లేదా "నిర్లక్ష్యం" లేదా "వదులుకోవడం" లేదా "దూరంగా వెళ్లిపోవడం" లేదా "వెనుక వదిలివేయు" వంటివి ఉండవచ్చు.
  • దేవుని చట్టాన్ని "విడిచిపెట్టడానికి" "దేవుని చట్టానికి  అవిధేయత" అని అనువదించవచ్చు. దీనిని "వదిలిపెట్టడం" లేదా "వదులుకోవడం" లేదా అతని బోధనలు లేదా అతని చట్టాలను "పాటించడం మానివేయడం" అని కూడా అనువదించవచ్చు.
  • "విడిచిపెట్టు" అనే పదబంధాన్ని "విడిచిపెట్టబడిన" లేదా "వదిలివేయబడిన" అని అనువదించవచ్చు.
  • ఒక విషయాన్నీ  లేదా  ఒక వ్యక్తిని విడిచిపెట్టడాన్ని ఇది వర్ణిస్తున్నది  అన్న దానిపై ఆధారపడి, ఈ పదాన్ని అనువదించడానికి వివిధ పదాలను ఉపయోగించడం మరింత స్పష్టంగా ఉంటుంది.

బైబిలు రిఫరెన్సులు:

  • 1 రాజులు 06: 11-13
  • దానియేలు 11: 29-30
  • ఆదికాండము 24:27
  • యెహోషువా 24: 16-18
  • మత్తయి 27: 45-47
  • సామెతలు 27: 9-10
  • కీర్తనలు 71:18

పదం సమాచారం:

  • Strongs: H0488, H2308, H5203, H5428, H5800, H5805, H7503, G06460, G06570, G08630,  G14590,  G25410