te_tw/bible/other/flood.md

3.7 KiB
Raw Permalink Blame History

వరద, వరదలు, వరద ముంపు, వరదనీరు

నిర్వచనం:

"వరద" అంటే అక్షరాలా గొప్ప జలరాశి ప్రదేశాన్ని పూర్తిగా కప్పివేయడం.

  • ఈ పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు హటాత్తుగా సంభవించి దేన్నైనా ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి, చేయడం.
  • నోవహు కాలంలో ప్రజలు దుర్మార్గులైపోతే దేవుడు ప్రపంచ వ్యాప్తంగాపర్వత శిఖరాలు సైతం మునిగిపోయే వరద రప్పించాడు. నోవహుతో నావలో లేని ప్రతి ఒక్కరూ మునిగి చచ్చారు. మిగతా వరదలు అన్నీ చిన్న ప్రదేశాలను ముంచినవే.
  • ఈ పదాన్ని క్రియ రూపంలో చెప్పవచ్చు. " దేశం అంతా నీటిలో మునిగి పోయింది."

అనువాదం సలహాలు:

  • అక్షరార్థంగా "వరద"ను అనువదించడం. "నీరు ముంచెత్తడం” లేక “జల సమూహాలు."
  • అలంకారికంగా "వరద వలె" అని పోలిక చెప్పడంలో ప్రత్యామ్నాయ పదం ఉపయోగిస్తారు. ఇది నది లాంటి ప్రవహించే దేన్నైనా సూచిస్తుంది.
  • "వరద నీటి వలె" అన్న చోట "వరద" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చెయ్యడం.” లేక “పొర్లి పారడం."
  • ఈ పదాన్ని రూపకాలంకారంగా ఉపయోగించవచ్చు. "నాపై వరద ప్రవాహించ నియ్యకు" అంటే "నాకు సంభవించే అరిష్టాలు నన్ను అల్లకల్లోలం చెయ్య నివ్వకు” లేక “విపత్తులు నన్ను పాడు చేయనియ్యకు” లేక “నీ కోపం నన్ను నాశనం చెయ్యకుండా కాపాడు." (చూడండి: రూపకాలంకారంగా)
  • అలంకారికంగా "నా కన్నీరు నా పడకను వరదలాగా ముంచి వేస్తున్నది" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నా కన్నీటి చుక్కలు నా పడకను వరద నీరులాగా ముంచి వేస్తున్నది."

(చూడండి: మందసం, నోవహు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3999, G26270