te_tw/bible/other/fast.md

3.6 KiB
Raw Permalink Blame History

ఉపవాసం, ఉపవాసం ఉండడం

నిర్వచనం:

"ఉపవాసం" ఉండడం అంటే ఆహారం ఒక రోజు లేక కొంతకాలం మానుకోవడం. కొన్ని సార్లు నీరు తాగడం కూడా మానేస్తారు.

  • ఉపవాసం మనుషులకు దేవునిపై దృష్టి కేంద్రీకరించి ప్రార్థించడానికి తోడ్పడుతుంది. ఆహారం, తినడం మూలంగా ఏకాగ్రత చెడకుండా ఇది తోడ్పడుతుంది.
  • యేసును దోషిగా తీర్చిన యూదు మత నాయకులు ఉపవాసాన్ని తప్పు కారణాలకు ఆచరిస్తారు. వారు న్యాయవంతులని ఇతరులు అనుకోవాలని వారు ఉపవాసం ఉంటారు.
  • కొన్ని సార్లు మనుషులు ఎందుకు ఉపవాసం ఉంటారంటే వారు ఏదో కారణం వల్ల విచారంగా ఉంటారు.
  • "ఉపవాసం ఉండడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తినడం మానుకోవడం” లేక “తినక పోవడం."
  • "ఉపవాసం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆహారం మానిన సమయం” లేక “ఆహారానికి దూరంగా ఉండడం."

(చూడండి: Jewish leaders)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __25:1__యేసు బాప్తిసం పొందిన తక్షణమే, పరిశుద్ధాత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి కొంచుబోయాడు. అక్కడ అయన నలభై రోజులు, నలభై రాత్రుళ్ళు ఉపవాసం ఉన్నాడు.
  • 34:8 "'ఉదాహరణకు, నేను ప్రతి వారం రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను. నాకు వచ్చిన డబ్బులో సరుకుల్లో పది శాతం దేవునికి ఇస్తాను.'"
  • __46:10__ఒక రోజు అంతియొకయ క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే, పరిశుద్ధాత్మ వారితో , "నేను పిలిచిన పనికోసం బర్నబాను, సౌలును పంపండి" అని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strongs: H2908, H5144, H6684, H6685, G35210, G35220