te_tw/bible/other/exile.md

3.2 KiB

చేర (బహిష్కారం), చేరకుతీసుకుపోవటం

నిర్వచనం:

"చేర" అనే పదం ప్రజలు తమ స్వదేశానికి దూరంగా ఎక్కడో నివసించడానికి బలవంతం చేయడాన్ని సూచిస్తుంది.

  • ప్రజలు సాధారణంగా శిక్ష కోసం లేదా రాజకీయ కారణాల కోసం చేరకు పంపబడతారు.
  • జయించబడిన ప్రజలను జయించిన సైన్యం వారి కోసం పని చేయడానికి, వారి దేశానికి చేరకుతీసుకువెళ్ళటం.
  • “బబులోనులు చేర” (లేదా “ప్రవాసం”) అనేది బైబిలు చరిత్రలో యూదా ప్రాంతంలోని అనేకమంది యూదు పౌరులను వారి ఇళ్ల నుండి తీసుకెళ్లి బబులోనులు కొరకు నివసించేలా బలవంతం చేయబడిన కాలం. ఇది 70 సంవత్సరాలు కొనసాగింది.
  • “బహిష్కృతులు” అనే పదం తమ స్వదేశానికి దూరంగా చేరలో నివసిస్తున్న ప్రజలను సూచిస్తుంది.

అనువాద సూచనలు:

  • “చేర” అనే పదాన్ని “బయటకు పంపడం” లేదా “బలవంతం చేయడం” లేదా “బహిష్కరించడం” అని కూడా అనువదించవచ్చు.
  • “చేర” అనే పదాన్ని ఒక పదంతో లేదా శైలి అనువదించవచ్చు"బహిష్కరించబడిన సమయం" లేదా " వెళ్లగొట్టిన సమయం" లేదా "బహిష్కరణ సమయం" లేదా "బహిష్కరణ" అని అర్ధం.
  • “బహిష్కృతులు” అని అనువదించే మార్గాల్లో “బహిష్కరించబడిన ప్రజలు” లేదా “వెళ్లగొట్టిన ప్రజలు” లేదా “బబులోనుకు బహిష్కరించబడిన ప్రజలు” ఉండవచ్చు.

(ఇది కూడా చూడండి: [బబులోను], [యూదా])

బైబిలు సూచనలు:

  • [2 రాజులు 24:14]
  • [దానియేలు 2:25-26]
  • [యెహెజ్కేలు 1:1-3]
  • [యెషయా 20:4]
  • [యిర్మీయా 29:1-3]

పద సమాచారం:

  • స్ట్రాంగ్స్: హెచ్1123, హెచ్1473, హెచ్1540, హెచ్1541, హెచ్1546, హెచ్1547, హెచ్3212, హెచ్3318, హెచ్5080, హెచ్6808, హెచ్7617, హెచ్7622, హెచ్8689, జి39270