te_tw/bible/other/enslave.md

3.3 KiB

బానిసను చేయడం, బానిస, కట్టుబానిస, కట్టబడిన

నిర్వచనం:

"బానిసను చేయడం" అంటే ఎవరినైనా ఒక యజమానిని సేవించేలా బలవంతం చెయ్యడం లేదా ఒక దేశానికి సేవ చెయ్యడానికి బలవంతం చెయ్యడం. "బానిసను చేయడం" లేదా "బానిసత్వంలో" అంటే ఒకదాని ఆధీనంలో లేదా ఒకరి ఆధీనంలో ఉండడం అని అర్థం.

  • ఒక వ్యక్తి బానిసగా ఉన్నప్పుడూ లేదా బానిసత్వంలో ఉన్నప్పుడూ అతడు ఎటువంటి జీతభత్యాలు లేకుండా ఇతరులకు సేవ చేయాలి. తాను కోరుకొన్నదానిని చేయడానికి అతనికి స్వేచ్చ లేదు. "బంధకత్వం" పదానికి మరో పదం "బానిసత్వం".
  • ప్రభువైన యేసు మానవులను స్వతంత్రులనుగా చేసేవరకూ వారు పాపానికి "బానిసలుగా" ఉన్నారని క్రొత్త నిబంధన మాట్లాడుతుంది. ఒక వ్యక్తి క్రీస్తులో నూతన జీవాన్ని పొందుకొన్నప్పుడు అతడు పాపానికి బానిసగా ఉండడు, నీతికి బానిస అవుతాడు.

అనువాదం సలహాలు:

  • "బానిసను చేయడం" పదం "స్వతంత్రుడిగా ఉండకుండా చెయ్యడం" లేదా "ఇతరులకు సేవ చెయ్యడానికి బలవంతం చెయ్యడం" లేదా "ఇతరుల ఆధీనంలో ఉంచడం" అని అనువదించబడవచ్చు.
  • "బానిసను చేయడం" లేదా "బానిసత్వంలో" పదబంధాలు "బానిసగా ఉండడానికి బలవంతం చెయ్యడం" లేదా సేవ చేయాడానికి బలవంతం చెయ్యబడడం" లేదా "ఒకరి నియంత్రణ క్రిందకు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: స్వేచ్ఛనీతిమంతుడుసేవకుడు)

బైబిలు రిఫరెన్సులు:

  • గలతీ 04:03
  • గలతీ 04:24-25
  • ఆది. 15:13
  • యిర్మీయా 30:08-09

పదం సమాచారం:

  • Strong's: H3533, H5647, G13980, G14020, G26150