te_tw/bible/other/delight.md

3.4 KiB
Raw Permalink Blame History

ఆనందించు, ఆనందించిన, ఆనందకరం

నిర్వచనం:

"ఆనందించు" అంటే గొప్ప ఆనందం కలగ జేసే వాటిని బట్టి సంతోషించడం.

  • దేనిలోనైనా "ఆనందించడం" అంటే "దాన్ని బట్టి సంతోషించడం” లేక “ఆనందం పొందడం."
  • ఏదైనా చాలా సమ్మతమైన, ఆనందకరమైన దాన్ని ఇలా పిలుస్తారు.
  • ఎవరైనా ఒక దానిలో ఆనందిస్తున్నారంటే అతడు దానిలో ఎంతో సౌఖ్యం అనుభవిస్తున్నాడని అర్థం.
  • "నా ఆనందం యెహోవా న్యాయ విధి లోనే" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యెహోవా న్యాయవిధి గొప్ప ఆనందం కలుగజేస్తుంది.” లేక “యెహోవా చట్టాలకు లోబడం అంటే నాకెంతో ఇష్టం” లేక “నేను యెహోవా ఆజ్ఞలకు లోబడుతున్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది."
  • "దానిలో నాకు ఏమీ ఆనందం లేదు” “దానిలో నేను ఆనందించను" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నాకు దాని వల్ల ఏమీ అనందం లేదు” లేక “నేను ఆనందించను."
  • పద బంధం "అందులో తాను ఆనందించడం" అంటే "అతడు అది చేయడంలో సంతోషపడుతున్నాడు" లేక "అతనికి దాని విషయంలో ఆనందం ఉంది.”
  • ఈ పదం "ఆనందించు" అనేది ఒక మనిషి ఆనందించే వస్తువులను సూచిస్తున్నది. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సంతోషపెట్టే” లేక “అనందం కలిగించే వస్తువులు."
  • "నీ చిత్తం జరిగించడానికి నేను ఆనందిస్తున్నాను" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నీ చిత్తంలో నేను ఆనందిస్తున్నాను” లేక “నేను నీకు లోబడినప్పుడు అది నాకెంతో ఆనందం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1523, H2530, H2531, H2532, H2654, H2655, H2656, H2836, H4574, H5276, H5727, H5730, H6026, H6027, H7306, H7381, H7521, H7522, H8057, H8173, H8191, H8588, H8597