te_tw/bible/other/bury.md

3.4 KiB

పాతిపెట్టు, పాతిపెట్టిన, సమాధి

నిర్వచనము:

"పాతిపెట్టుట "అనేది సాధారణంగా మృత దేహాన్ని నేలలోగానీ, ఏదైనా సమాధి స్థలంలో గానీ ఉంచి మట్టితో లేక రాళ్లతో కపుటకు వాడే మాట. దేనినైనా పాతిపెట్టే కార్యక్రమాన్ని లేక పాతిపెట్టిన స్థలాన్ని సూచించుటకు “సమాధి” అన్న పదాన్ని ఉపయోగిస్తారు.

  • తరచుగా నేలలో గుంట తవ్వి మృత దేహాన్ని ఉంచి ఆ పైన మట్టితో  కప్పివేస్తారు.
  • కొన్ని సార్లు మృత దేహాన్ని పెట్టె వంటి దానిలో అంటే శవ పేటికలో ఉంచి దాన్ని పాతిపెడతారు.
  • బైబిల్ కాలాల్లో, మృత దేహాన్ని తరచుగా గుహ లేక అటువంటి దానిలో ఉంచుతారు. యేసు చనిపోయాక , తన శరీరాన్ని బట్టలో చుట్టి రాతిలో తొలిచిన సమాధిలో పెట్టి పెద్ద బండ రాయితో మూసివేసారు.
  • "సమాధి స్థలం” లేక “సమాధి గది” లేక “సమాధి కుహరం” లేక “సమాధి గుహ"అనేవి మృత దేహాన్ని పాతిపెట్టే స్థలం పేర్లు.
  • ఇతర విషయాలను కూడా పాతిపెడతారు. ఉదాహరణకు ఆకాను యెరికోలో దొంగిలించిన వెండి, ఇతర వస్తువులను నేలలో పాతిపెట్టాడు.
  • "తన ముఖాన్న పాతిపెట్టడం " అంటే సాధారణంగా "తన చేతులతో ముఖం కప్పుకున్న" అనే అర్థం వస్తుంది.
  • కొన్ని సార్లు ఈ పదం "దాచి పెట్టు"అనే దానికి "పాతిపెట్టు"అనే అర్థం వస్తుంది. ఆకాను కొన్ని వస్తువులను యెరికోలో దొంగిలించి నేలలో దాచిపెట్టాడు. అంటే అతడు నేలలో పాతిపెట్టాడు.

(చూడండి: Jericho, tomb)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

●        Strong's: H6900, H6912, H6913, G17790, G17800, G22900, G49160, G50270