te_tw/bible/other/bowweapon.md

2.1 KiB

విల్లు, బాణాలు, విల్లంబులు

నిర్వచనం:

నారి కట్టిన విల్లు నుండి బాణాలు నుండి విసిరే ఆయుధం. బైబిల్ కాలాల్లో దీన్ని శత్రువులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలోగానీ, ఆహారానికై జంతువుల వేటలోగానీ ఉపయోగిస్తారు.

  • విల్లును కట్టెతో గానీ, ఎముక, లోహం, లేక జింక కొమ్ములు వంటి ఇతర బలమైన పదార్థంతో చేస్తారు. అది వంగి ఉండి బిగుతుగా నారితో లాగి కట్టి ఉంటుంది.
  • బాణం సన్నని చువ్వలాగా ఉండి. చివరన పదునైన ఇనప ములికి అమర్చి ఉంటుంది. ప్రాచీన కాలంలో, బాణాలు వెదురు, ఎముక, రాయి, లేక లోహంతో తయారు చేసే వారు.
  • విల్లంబులను సాధారణంగా వేటగాళ్ళు, యోధులు ఉపయోగిస్తారు.
  • బైబిల్లో "బాణం"అనే దాన్ని కొన్ని సార్లు శత్రువులను, లేక దైవ తీర్పును సూచించ డానికి అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2671, H7198, G5115