te_tw/bible/other/blemish.md

2.0 KiB

కళంకము, నిష్కళంకమైన, లోపం

వాస్తవాలు:

"కళంకము" అనే పదం ఒక జంతువు లేదా వ్యక్తిపై శారీరక లోపం లేదా అసంపూర్ణతను సూచిస్తుంది. ఇది ప్రజలలోని ఆధ్యాత్మిక లోపాలను మరియు తప్పులను కూడా సూచిస్తుంది.

  • కొన్ని బలుల కోసం, ఎటువంటి కళంకములు లేదా లోపాలు లేని జంతువులను బలి అర్పించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆదేశించాడు.
  • ఏ పాపం లేకుండా, యేసుక్రీస్తు సంపూర్ణమైన బలి ఎలా ఉండిదో తెలిపే చిత్రమిది.
  • క్రీస్తులో విశ్వసించినవారు ఆయన రక్తము ద్వారా వారి పాపలు నుండి శుద్ధి చేయబడి, కళంకము లేనివారిగా పరిగణించబడతారు.
  • ఈ పదాన్ని అనువదించే మార్గాలలో సందర్భాన్ని బట్టి “లోపం” లేదా “అసంపూర్ణత” లేదా “పాపం” ఉండవచ్చు.

(ఇవి కూడా చూడండి: [నమ్మకం], [శుభ్రం], [బలి], [పాపం])

బైబిలు వివరణలు:

  • [1 పేతురు 1:19]
  • [2 పేతురు2:13]
  • [ద్వితీయోపదేశకాండం 15:19-21]
  • [సంఖ్యాకాండం 6:13-15]
  • [పరమ గీతము4:7]

పద సమాచారం:

  • స్ట్రాంగ్స్: హెచ్3971, హెచ్8400, హెచ్8549, జి34700