te_tw/bible/other/biblicaltimeyear.md

2.9 KiB
Raw Permalink Blame History

సంవత్సరం, సంవత్సరాలు

నిర్వచనం:

ఈ పదం "సంవత్సరం"ను బైబిల్లో అక్షరాలా 354 రోజుల కాలాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. చాంద్రమానం కాలెండర్ పద్ధతి ప్రకారం ఈ లెక్క. ఇది చంద్రుడు భూమిని చుట్టి వచ్చేటందుకు పట్టే సమయం.

  • ఆధునిక సౌరమాన కాలెండర్ ప్రకారమైతే ఒక సంవత్సరం 365 రోజులు ఉంటుంది. దీన్ని 12 నెలలుగా విభజిస్తారు. ఇది భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి వచ్చే సమయం.
  • రెండు కాలెండర్ పద్ధతుల్లోనూ ఒక సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. అయితే అదనంగా 13వ నెల కొన్ని సార్లు చాంద్రమానం కాలెండర్ సంవత్సరానికి జోడిస్తారు. ఎందుకంటే /చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కంటే 11రోజులు తక్కువ. ఈ విధంగా ఈ రెండు కాలెండర్లు ఒకదానికొకటి సమంగా ఉంటాయి.
  • బైబిల్లో "సంవత్సరం "అనే పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. ఏదైనా ఒక ప్రత్యేక సంఘటన చోటు చేసుకునే సమయాన్ని సూచించడానికి ఇలా చేస్తారు. ఉదాహరణకు "యెహోవా సంవత్సరం” లేక “కరువు సంవత్సరం” లేక “ప్రభువు అనుగ్రహ సంవత్సరం." ఈ సందర్భాల్లో, "సంవత్సరం "అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సమయం” లేక “కాలాలు” లేక “కాల వ్యవధి."

(చూడండి: నెల)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3117, H7620, H7657, H8140, H8141, G17630, G20940