te_tw/bible/other/betray.md

5.0 KiB

ద్రోహం, ద్రోహి

నిర్వచనం:

"ద్రోహం"అంటే ఎవరినైనా మోసగించి హాని చెయు విధముగా వ్యవహరించడం. "ద్రోహి" అంటే తనపై నమ్మకముంచిన స్నేహితునికి ద్రోహం/మోసం చేసేవాడు.

  • యూదా "ద్రోహి"ఎందుకంటే అతడు యూదుల నాయకులకు యేసును ఎలా పట్టుకోవాలో చెప్పాడు.
  • యూదా చేసిన ద్రోహం ముఖ్యంగా దుర్మార్గం ఎందుకంటే అతడు యేసు యొక్క అపోస్తలుడు. యూదుల నాయకుల నుండి డబ్బు తీసుకుని యేసుకు అన్యాయంగా మరణ శిక్ష పడేలా చేశాడు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, “ద్రోహం"అనే దాన్ని "మోసగించి హాని చేయు” లేక “శత్రువుకు అప్పగించు” లేక “కపటంగా ప్రవర్తించు" అని అనువాదం చెయ్యవచ్చు.
  • "ద్రోహి"అనే పదాన్ని "ద్రోహం చేసే వ్యక్తి” లేక “కపట వర్తనుడు” లేక “వంచకుడు" అని అనువాదం  చెయ్యవచ్చు.

(చూడండి: Judas Iscariot, Jewish leaders, apostle)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __21:11__ఇతర ప్రవక్తలు ముందుగా ప్రవచించారు. మెస్సియాను చంపిన వారు అయన బట్టలకోసం చీట్లు వేస్తారని అయన మిత్రుడే ఆయనకు ద్రోహం చేస్తాడని చెప్పారు. ఒక స్నేహితుడు ముఫ్ఫై వెండి నాణాలు పుచ్చుకుని మెస్సియాకు ద్రోహం చేస్తాడని జెకర్యా ప్రవక్త ముందుగా ప్రవచించాడు.
  • __38:2__తరువాత యేసు, అయన శిష్యులు యెరూషలేముకు వచ్చినప్పుడు, యూదా యూదుల నాయకుల దగ్గరకు పోయి తనకు డబ్బిస్తే యేసుకు ద్రోహం చేసి, పట్టిస్తానని చెప్పాడు.
  • 38:3  ప్రధాన యాజకుని నాయకత్వంలో యూదుల నాయకులు, యూదాకు ముఫ్ఫై వెండి నాణాలు ఇచ్చి యేసుకు ద్రోహం చేసేలా చేశారు.
  • __38:6__తరువాత తన శిష్యులకు "మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు అని యేసు చెప్పాడు. "నేను ఎవరికి రొట్టె ముక్క ఇస్తానో అతడే నాకు ద్రోహం చేస్తాడు."
  • __38:13__మూడవ సారి తిరిగి వెళ్లి, యేసు వారితో అన్నాడు. "లేవండి! నాకు ద్రోహం చేసే వాడు ఇడుగో వచ్చాడు."
  • __38:14__తరువాత యేసు చెప్పాడు, "యూదా, చేయడానికి నన్ను ముద్దుతో ద్రోహం చేస్తున్నావా?
  • __39:8__ఈ లోగా, ద్రోహి అయిన యూదా, యూదుల నాయకులు యేసుకు మరణ శిక్ష విధించారని తెలుసుకున్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. అతడు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H7411, G38600, G42730