te_tw/bible/other/astray.md

3.9 KiB
Raw Permalink Blame History

త్రోవతప్పి, త్రోవతప్పిపోవు, త్రోవతప్పి వెళ్ళడం, త్రోవతప్పి నడిపించుట, తప్పిపోవడం

నిర్వచనం:

"తప్పిపోవడం," "త్రోవతప్పిపోవడం" అనే పదాలు దేవుని చిత్తానికి అవిధేయత చూపించడం అనే అర్థాన్ని ఇస్తాయి. "దారి తొలగి నడిపించబడిన వారు" దేవునికి అవిద్యేయులగుటకు ఇతరులు తమను ప్రభావితం చేయుటకు లేదా పరిస్థితులు ప్రభావితం చేయుటకు అనుమతించారు.

·         "తప్పిపోవడం" అనే పదం స్పష్టమైన మార్గాన్నీ లేదా సురక్షిత ప్రదేశాన్ని విడిచి ఒక తప్పు మార్గంలోనికీ, ప్రమాదకరమైన మార్గంలోనికీ వెళ్లడాన్ని సూచిస్తున్నది.

·         తమ కాపరి పచ్చిక బీడును విడిచిపెట్టిన గొర్రెలు "తప్పిపోయాయి." తనను విడిచిపెట్టి, "దారితప్పిపోయిన" పాపాత్మ ప్రజలను దేవుడు గొర్రెలతో సరిపోల్చుతున్నాడు.

అనువాదం సలహాలు:

·         "దారి తప్పిపోవడం" అనే పదబంధమును "దేవుని నుండి వెళ్ళిపోవడం" లేదా "దేవుని చిత్తం నుండి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోవడం" లేదా "దేవునికి విధేయత చూపించడం ఆపివెయ్యడం" లేదా "దేవుని నుండి దూరంగా వెళ్ళే మార్గంలో జీవించడం" అని అనువదించవచ్చు.

·         "ఒకరిని దారి తప్పిపోయేలా నడిపించడం" అనే వాక్యమును "ఒకరు దేవునికి అవిధేయత చూపేలా చేయడం" లేదా "దేవునికి విధేయత చూపడం ఆపివేసేలా ప్రభావితం చెయ్యడం" లేదా "ఒకరు తప్పుడు మార్గంలోని నిన్ను అనుసరించేలా చెయ్యడం" అని అనువదించవచ్చు.

(చూడండి: అవిధేయతకాపరి)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H5080, H7683, H7686, H8582, G41050, G53510