te_tw/bible/other/assign.md

3.1 KiB

అప్పగించు, అప్పగించబడింది, అప్పగించబడిన పని, తిరిగి అప్పగించడం

వాస్తవాలు:

ఈ పదం "అప్పగించు” లేక “అప్పగించబడింది" పదం ఒకరిని ఒక నిర్దిష్టమైన కర్తవ్యం చెయ్యడానికి నియమించడం లేక ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది మనుష్యులకు అందించడానికి దేనినైనా కేటాయించడమును సూచిస్తుంది.

  • రాజైన సౌలు ఇశ్రాయేలులోని శ్రేష్టమైన యువకులను సైన్యంలో సేవ చేసేందుకు “అప్పగిస్తాడు” సమూయేలు ప్రవక్త ముందుగానే చెప్పాడు.
  • మోషే ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలలో ప్రతి ఒక్కరికి కనాను దేశంలో నివసించడానికి కొంత భాగాన్ని మోషే “అప్పగించాడు.”
  • • పాత నిబంధన ధర్మశాస్త్రం కింద, ఇశ్రాయేలు కొన్ని గోత్రాలను యాజకులు, కళాకారులు, గాయకులు, నిర్మాణ పనివారుగా సేవ చేయడానికి అప్పగించబడ్డారు.
  • • సందర్భాన్ని బట్టి, "అప్పగించడం" పదం "ఇవ్వడం” లేక “నియమించడం” లేక “ఒక కార్యాచరణకై ఎన్నుకొనబడడం" అని అనువదించబడవచ్చు.
  • • ఈ పదం"అప్పగించడం" పదాన్ని "నియమించబడిన” లేక “కర్తవ్యం ఇవ్వబడింది" అని తర్జుమా చెయ్యబడవచ్చు

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: నియమించు, సమూయేలు, సౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2506, H3335, H4487, H4941, H5157, H5307, H5414, H5596, H5975, H6485, H7760, G3307