3.8 KiB
3.8 KiB
రెహబాము
వాస్తవాలు:
రెహబాము రాజైన సొలొమోను కుమారులలో ఒకడైయుండెను, మరియు సొలొమోను మరణించిన తరువాత ఇతను ఇశ్రాయేలు దేశమునకు రాజాయెను.
- రెహబాము పాలన ఆరంభములో తన ప్రజలతో చాలా తీవ్రమైన విధానములో నడుచుకొనియున్నాడు, ఇందుచేత తనకు విరుద్ధముగా ఇశ్రాయేలు పది గోత్రములవారు ఎదురు తిరిగి, వారు ఉత్తర దిక్కున “ఇశ్రాయేలు రాజ్యముగా” రూపించబడిరి.
- రెహబాము దక్షిణ యూదా రాజ్యమునకు రాజుగా కొనసాగించబడియున్నాడు, ఈ రాజ్యములో కేవలము యూదా మరియు బెన్యామీను అను రెండు గోత్రములు మాత్రమె ఉన్నాయి.
- రెహబాము దేవునికి లోబడని దుష్ట రాజైయుండెను మరియు తప్పుడు దేవుళ్ళను ఆరాధింఛియుండెను.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: ఇశ్రాయేలు రాజ్యము, యూదా, సొలొమోను)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 18:05 సొలొమోను మరణించిన తరువాత, తన కుమారుడు రెహబాము రాజాయెను. రెహబాము మూర్ఖుడైయుండెను.
- 18:06 రెహబాము మూర్ఖముగా జవాబునిచ్చాడు మరియు “నా తండ్రి సొలొమోను మీరు ఎక్కువగా కష్టపడునట్లు చేశాడని మీరనుకొనుచున్నారు, అయితే ఆయన కష్టపెట్టినదానికంటే నేను మిమ్ములను ఎక్కువగా కష్టపెడుతా, అంతేగాకుండా ఆయన శిక్షించినదానికంటే ఎక్కువగా నేను మిమ్ములను శిక్షిస్తాను” అని వారితో చెప్పాడు.
- 18:07 ఇశ్రాయేలు దేశపు పది గోత్రములవారు రెహబాముకు విరుద్ధముగా తిరుగబాటు చేసియున్నారు. కేవలము రెండు గోత్రములవారు మాత్రమె అతనికి నమ్మకముగా ఉండిరి.
పదం సమాచారం:
- Strong's: H7346, G4497