3.1 KiB
3.1 KiB
రెల్లు సముద్రము, ఎర్ర సముద్రము
వాస్తవాలు:
"రెల్లు సముద్రము” ఐగుప్తు మరియు అరేబియా మధ్య ఉన్న నీటి భాగం పేరు. ఇప్పుడు ఇది "ఎర్ర సముద్రం" అని పిలువబడుతుంది.
- ఎర్ర సముద్రం పొడవుగానూ మరియు ఇరుకుగానూ ఉంది. ఇది ఒక సరస్సు లేదా నది కంటే పెద్దది, అయితే సముద్రం కంటే చాలా చిన్నది.
- ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి పారిపోతున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటవలసి వచ్చింది. దేవుడు ఒక సూచక క్రియ చేసాడు, చేసి, సముద్ర జలాలను విభజించేలా చేసాడు, తద్వారా మనుష్యులు ఆరిన నేల మీద నడవగలిగారు.
- ఈ సముద్రానికి ఉత్తరంగా కనాను దేశం ఉంది.
- ఇది "ఎర్ర సముద్రము” అని కూడా అనువదించబడవచ్చు.
(ఈ పదములను కూడా చూడండి: అరేబియా, కానాను, ఐగుప్తు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
బైబిలు నుండి ఉదాహరణలు:
- 12:04 ఐగుప్తీయుల సైన్యము రావడం ఇశ్రాయేలీయులు చూచినప్పుడు, వారు ఫరో సైన్యము మరియు ఎర్ర సముద్రము మధ్యన చిక్కుకుపోయామని గుర్తించారు.
- 12:05 “ ఎర్ర సముద్రము వైపుకు కదలాలని మనుష్యులకు చెప్పమని దేవుడు మోషేకు చెప్పాడు.
- 13:01 దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము ద్వారా నడిపించిన తరువాత, ఆయన వారిని సీనాయి అని పిలువబడిన పర్వతము వద్దకు అరణ్యము ద్వారా నడిపించెను.
పదం సమాచారం:
- Strong's: H3220, H5488, G20630, G22810