te_tw/bible/names/lazarus.md

4.1 KiB

లాజరు

వాస్తవాలు:

లాజరు మరియు అతని సహోదరీలు మరియ, మార్త యేసుకు ప్రత్యేక స్నేహితులు. బేతనియలోని వారి ఇంటిలో యేసు తరచుగా వారితో ఉండేవాడు.

  • లాజరు చాలా రోజులపాటు సమాధిలో పాతిపెట్టబడిన తరువాత యేసు అతనిని మృతులలోనుండి లేపినందుకు లాజరు ప్రసిద్ధి చెందాడు.
  • యూదా నాయకులు యేసుపై కోపంగా ఉన్నారు మరియు ఆయన ఈ అద్భుతం చేశాడని అసూయ చెందారు, మరియు వారు యేసు మరియు లాజరు ఇద్దరినీ చంపడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు.
  • యేసు ఒక పేద బిచ్చగాడు మరియు ధనవంతుడి గురించి కూడా ఒక ఉపమానాన్ని చెప్పాడు, అందులో బిచ్చగాడు “లాజరు” అనే మరొక వ్యక్తి.

(అనువాద సూచనలు: [పేర్లను అనువదించడం ఎలా])

(ఇవి కూడా చూడండి: [బిచ్చమెత్తడం], [యూదు నాయకులు], [మార్త], [మరియ], [వృద్ధి చెయ్యడం])

బైబిలు రిఫరెన్సులు:

  • [యోహాను సువార్త 11:11]
  • [యోహాను సువార్త 12:1-3]
  • [లూకా సువార్త16:21]

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • [37:1] ఒకరోజు, లాజరు చాలా అనారోగ్యంతో ఉన్నాడని యేసుకు సందేశం వచ్చింది. __ లాజరు __ మరియు అతని ఇద్దరు సహోదరీలు, మరియు మరియు మార్త, యేసుకు సన్నిహిత స్నేహితులు.
  • [37:2] యేసు, "మా స్నేహితుడు లాజరు నిద్రపోయాడు, నేను అతనిని లేపాలి" అని చెప్పాడు.
  • [37:3] యేసు శిష్యులు, “బోధకుడా, లాజరు నిద్రపోతున్న యెడల, అతడు బాగుపడతాడు” అని జవాబిచ్చారు. అప్పుడు యేసు వారితో “లాజరు చనిపోయాడు” అని స్పష్టంగా చెప్పాడు.
  • [37:4] యేసు లాజరు' స్వస్థలానికి వచ్చినప్పుడు, లాజరు అప్పటికే చనిపోయి నాలుగు రోజులైంది.
  • [37:6] యేసు వారిని, “మీరు __లాజరు__ని ఎక్కడ ఉంచారు?” అని అడిగాడు.
  • [37:9] అప్పుడు యేసు, “లాజరు, బయటికి రా!” అని అరిచాడు.
  • [37:10] కాబట్టి __ లాజరు __ బయటకు వచ్చాడు! అతను ఇంకా సమాధి దుస్తులతో చుట్టబడి ఉన్నాడు.
  • [37:11] అయితే యూదుల మత పెద్దలు అసూయపడ్డారు, కాబట్టి వారు యేసును మరియు __లాజరు__ని ఎలా చంపవచ్చో ప్రణాళిక చేయడానికి ఒకచోట చేరారు.

పదం సమాచారం:

  • Strong's: G29760