2.4 KiB
2.4 KiB
గబ్రియేలు
వాస్తవాలు:
గబ్రియేలు దేవుని దేవదూతలలో ఒకని పేరు. పాత, కొత్త నిబంధనలు రెంటిలో ఇతని పేరు చాలా సార్లు ప్రస్తావించబడింది.
- దేవుడు గబ్రియేలును ప్రవక్త దానియేలు చూసిన దర్శనం గురించి వివరించటానికి పంపాడు.
- మరొక సారి దానియేలు ప్రార్థన చేస్తుంటే, దేవదూత గబ్రియేలు అతని దగ్గరకు ఎగిరి వచ్చి భవిష్యత్తులో జరగబోయే విషయాలు ప్రవచించాడు. దానియేలు అతన్ని ఒక మనిషిగా వర్ణించాడు.
- కొత్త నిబంధనలో గబ్రియేలు జెకర్యా దగ్గరకు వచ్చి గొడ్రాలైన అతని భార్య ఎలీసబెతుకు కుమారుడుగా యోహాను పుడతాడని చెప్పాడు.
- ఆరు నెలల తరువాత గబ్రియేలు మరియ దగ్గరికి వెళ్లి అద్భుత రీతిలో ఆమె గర్భం ధరిస్తుందనీ ఆమెకు పుట్టే శిశువు "దేవుని కుమారుడు" అనీ, ఆ కుమారుని పేరు "యేసు" అని చెప్పాడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: దేవదూత, దానియేలు, ఎలీసబెతు, యోహాను (బాప్తిస్మమిచ్చు), మరియ, ప్రవక్త, దేవుని కుమారుడు, జెకర్యా)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
- దానియేలు 08:15-17
- దానియేలు 09:20-21
- లూకా 01:18-20
- లూకా 01:26-29
పదం సమాచారం:
- Strong's: H1403, G10430