3.1 KiB
3.1 KiB
ఆరాము, ఆరామీయుడు, అరమేయిక్
నిర్వచనం:
"ఆరాము" పేరుతో పాత నిబంధనలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇది ఒక ప్రాంతం పేరు. కనానుకు ఈశాన్యంలో ఆధునిక సిరియాలో ఇది ఉంది.
- ఆరాములో నివసించే ప్రజలకు "ఆరామీయులు"అని పేరు వచ్చింది. వీరు "అరమేయిక్" భాష మాట్లాడుతారు. యేసు, ఇతర ఆ కాలంలో యూదులు అరమేయిక్ మాట్లాడే వారు.
- షేము కుమారుల్లో ఒకడి పేరు ఆరాము. ఇదే పేరున్న మరొక మనిషి రిబ్కా పిన తల్లి కుమారుడు. ఒక వేళ ఆరాము ప్రాంతానికి ఈ పేరు ఈ ఇద్దరు మనుషుల్లో ఒకరి మూలంగా కలిగి ఉండవచ్చు.
- ఆరాము తరువాత కాలంలో గ్రీకు పేరు "సిరియా"తో ప్రసిద్ధికెక్కింది.
- "పద్దన్ ఆరాము"అంటే "ఆరాము మైదానం."ఈ మైదానం ఆరాముకు ఉత్తరాన ఉంది.
- అబ్రాహాము బంధువులు కొందరు హారాను పట్టణంలో నివసించారు. ఇది "పద్దన్ ఆరాము"లో ఉంది.
- పాత నిబంధనలో, కొన్ని సార్లు పదాలు "ఆరాము” “పద్దన్ ఆరాము"ఒకే ప్రాంతం.
- ఈ పదం "ఆరాము నహరాయిము" అంటే "రెండు నదుల ఆరాము." ఈ ప్రాంతం మెసపొటేమియా ఉత్తరాన ఉంది. "పద్దన్ ఆరాము"కు తూర్పున ఉంది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: మెసపొటేమియా, పద్దన్ ఆరాము, రిబ్కా, షేము, సిరియా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1దిన 01:17-19
- 2సమూయేలు 08:5-6
- ఆమోసు 01:5
- యెహెజ్కేలు 27:16-18
- ఆది 31:19-21
- హోషేయ 12:11-12
- కీర్తనలు 060:1
పదం సమాచారం:
- Strong's: H758, H763, G689