te_tw/bible/names/abijah.md

1.8 KiB
Raw Permalink Blame History

అబీయా

వాస్తవాలు:

అబీయా క్రీ. పూ. 915నుడి 913 వరకు పరిపాలించిన యూదా రాజు. ఇతడు రెహబాము కొడుకు. పాత నిబంధనలో అబీయా అనే పేరుతో ఇంకా కొందరు ఉన్నారు:

  • సమూయేలు కొడుకులు అబీయా, యోవేలు బెయేర్షేబాలో ఇశ్రాయేలు ప్రజల నాయకులు. అబీయా, అతని సోదరుడు నిజాయితీ లేనివారు, డబ్బుకు ఆశపడేవారు గనక తమపై పరిపాలన చెయ్యడానికి రాజును నియమించమని ప్రజలు సమూయేలును అడిగారు.
  • అబీయా దావీదురాజు కాలంలో దేవాలయ యాజకుడు కూడా.
  • అబీయా యరోబాము కొడుకుల్లో ఒకడు.
  • అబీయా బబులోను చెర నుండి జెరుబ్బాబెలుతో కలిసి తిరిగి వచ్చిన వ్యక్తి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0029, G00070