te_tw/bible/kt/zion.md

2.7 KiB
Raw Permalink Blame History

సీయోను, సీయోను పర్వతం

నిర్వచనం:

వాస్తవానికి, " సీయోను " లేదా " సీయోను పర్వతం" అనే పదం దావీదు రాజు యెబూసీయుల నుండి స్వాధీనం చేసుకున్న బలమైన కోట లేదా కోటను సూచిస్తుంది. ఈ రెండు పదాలు యెరూషలేమును సూచించడానికి ఇతర మార్గాలుగా మారాయి.

  • సీయోను పర్వతం మరియు మోరియా పర్వతములలో . మీద యెరూషలేము నగరం ఉంది. తరువాత ఈ రెండు పర్వతాలనూ, యెరూషలేము నగరాన్నీ సూచించడానికి “సీయోను”మరియు “సీయోను పర్వతము” సాధారణ పదాలుగా ఉపయోగించబడ్డాయి. కొన్నిసార్లు వారు యెరూషలేములో ఉన్న ఆలయాన్ని కూడా సూచించారు. (చూడండి: [అన్యాపదేశము])
  • సీయోను లేదా యెరూషలేముకు “దావీదు నగరం” అని దావీదు పేరు పెట్టాడు. ఇది దావీదు యొక్క స్వస్థలము బెత్లెహేముకు భిన్నమైనది, దీనిని దావీదు నగరం అని కూడా పిలువబడుతుంది.
  • ఇశ్రాయేలును లేదా దేవుని ఆత్మీయ రాజ్యాన్ని లేదా దేవుడు సృష్టించబోయే నూతన పరలోక యెరూషలేమును సూచించడానికి “సీయోను”అనే పదం ఇతర అలంకారిక మార్గాల్లో ఉపయోగించబడింది.

(వీటిని కూడా చూడండి: [అబ్రాహాము], [దావీదు], [యెరూషలేము], [బెత్లెహేము], [యెబూసీయులు])

బైబిలు రిఫరెన్సులు:

  • [1 దినవృత్తాంతములు 11:5]
  • [ఆమోసు 1:2]
  • [యిర్మీయా 51:35]
  • [కీర్తనలు 76:1-3]
  • [రోమీయులకు 11:26]

పదం సమాచారం:

  • Strong's: H6726