3.8 KiB
3.8 KiB
అయ్యో
నిర్వచనము:
“అయ్యో” అనే పదము గొప్ప బాధతో కూడిన భావమును సూచించును. ఎవరైనా ఏదైనా అతీ తీవ్రమైన అపాయమును అనుభవిస్తారని చెప్పే హెచ్చరికను కూడా ఈ పదము తెలియజేయుచున్నది.
- ప్రజలు తమ పాపములనుబట్టి పొందుకునే శిక్షగా వారు అనుభవించే శ్రమలను ప్రజలకు హెచ్చరికగా “అయ్యో” అనే పదమును జతపరిచి వ్యక్తపరుస్తారు.
- పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలాలలో భయానకమైన తీర్పును నొక్కి చెప్పుటకు “అయ్యో” అనే పదము పునరావృతం అయ్యుంటుంది.
- “అయ్యో నేను” లేక “అయ్యో నాకు” అనే మాటలను ఒక వ్యక్తి చెబుతున్నాడంటే అతి తీవ్రమైన శ్రమను గుర్చిన బాధను వ్యక్తపరచుకోవడం అని అర్థము.
తర్జుమా సలహాలు:
- సందర్భానుసారముగా, “అయ్యో” అనే పదము కూడా “గొప్ప బాధ” లేక “దుఃఖము” లేక “విపత్తు” లేక “ఉపద్రవం” అని కూడా తర్జుమా చేయుదురు.
- “(ఏదైనా పట్టణము పేరు చెప్పి) అయ్యో” అని చెప్పిన మాటను తర్జుమా చేయు అనేక విధానములలో “(ఆ పట్టణము) కొరకు జరగబోయేది ఎంత భయానకము” లేక “(పట్టణములో) ప్రజలు భయంకరముగా శిక్షించబడుదురు లేక “చాలా భయంకరముగా ఆ ప్రజలు శ్రమిస్తారు” అనే మాటలను కూడా చేర్చుదురు.
- “అయ్యో నేను!” లేక “అయ్యో నాకు!” అనే ఈ మాటను “నేను ఎంత దౌర్భాగ్యుడను!” లేక “నేను దౌర్భాగ్యుడను!” లేక “నాకు కలిగింది ఎంత భయానకము!” అని కూడా తర్జుమా చేయకూడదు.
- “అయ్యో నీకు” అనే మాటను “నీవు భయంకరముగా శ్రమపడుతావు” లేక “నీవు భయంకరమైన శ్రమలను అనుభవిస్తావు” అని తర్జుమా చేయవచ్చును.
పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:
- యెహే.13:17-18
- హబ.02:12-14
- యెషయా.31:1-2
- యిర్మియా.45:1-3
- యూదా.01:9-11
- లూకా.06:24-25
- లూకా.17:1-2
- మత్తయి.23:23-24
పదం సమాచారం:
- Strong’s: H0188, H0190, H0337, H0480, H1929, H1945, H1958, G37590