te_tw/bible/kt/restore.md

3.6 KiB

పునరుద్ధరించు, పునరుద్ధరణ

నిర్వచనము:

“పునరుద్పుదరించు” మరియు “పునర్ స్థాపనము” అనే మాటలు ఏదైనా తన పూర్వ స్థితికి తిరిగి వచ్చుటను మరియు ఉత్తమ స్థితియందు ఉండుటను సూచిస్తుంది.

  • రోగగ్రస్తమైన శరీర అవయవమును పునర్ స్థాపించినప్పుడు, దాని అర్థము అది “స్వస్థతపొందినది” అని అర్థమునైయున్నది.
  • పునరుద్పుధరించబడిన సంబంధము “సమాధానపరచబడియున్నది.” దేవుడు పాపసంబంధమైన ప్రజలను పునరుద్ధరించును మరియు వారిని ఆయన వద్దకు తిరిగి రప్పించుకొనును.
  • ప్రజల తమ స్వంత దేశమునందు పునరుద్ధరించ బడినట్లయితే, వారు ఆ దేశమునకు “తిరిగి వచ్చారు” లేక “వెనక్కి తీసుకు రాబడియున్నారు” అని అర్థము.

అనువాద సూచనలు:

  • సందర్భానుసారముగా, “పునర్ స్థాపించు” అనే మాటను తర్జుమా చేయు విధానములో “పునరుద్ధరణ” లేక “తిరిగి చెల్లించుట” లేక “తిరిగి వచ్చుట” లేక “స్వస్థత” లేక “వెనక్కి తిరిగి వచ్చుట” అనే మాటలను కూడా ఉపయోగించుదురు.
  • ఈ మాటకు ఇతర మాటలను మనము చూచినట్లయితే, “క్రొత్తదిగా చేయు” లేక “మరొకమారు క్రోత్తదానివలె చేయుము” అనే మాటలను వినియోగిస్తారు.
  • ఆస్తిపాస్తులు తిరిగి “పునర్ స్థాపించబడినప్పుడు”, అది దానికి సంబంధించిన యజమానునికి “సరిచేయబడినది” లేక “తిరిగి ఇవ్వబడినది” లేక “వెనక్కి ఇవ్వబడినది” అని అర్థము.
  • సందర్భానుసారముగా, “పునర్ స్థాపనము” అనే ఈ మాటను “పునరుద్ధరణ” లేక “స్వస్థపరచబడుట” లేక “సమాధానపరచబడుట” అని కూడా తర్జుమా చేయుదురు.

బైబిలు రిఫరెన్సులు:

  • [2 రాజులు.05:8-10]
  • [అపొ.కార్య.03:21-23]
  • [అపొ.కార్య.15:15-18]
  • [యెషయ.49:5-6]
  • [యిర్మియా.15:19-21]
  • [విలాప.05:19-22]
  • [లేవి.06:5-7]
  • [లూకా.19:8-10]
  • [మత్తయి.12:13-14]
  • [కీర్తన.080:1-3]

పదం సమాచారం:

  • Strong's: H7725, H7999, H8421, G600, G2675