te_tw/bible/kt/manna.md

2.8 KiB

మన్నా

నిర్వచనం:

మన్నా ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన తరువాత అరణ్యంలో నివసించిన 40 సంవత్సరాలలో తినడానికి దేవుడు వారికి అందించిన తెల్లటి, ధాన్యం వంటి ఆహారం.

  • మన్నా ప్రతి ఉదయం మంచు కింద నేల మీద తెల్లటి రేకులులా కనిపించింది. ఇది తేనె లాగా తీపి రుచిగా ఉంది.
  • ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినములో తప్ప ప్రతిరోజూ మన్నా రేకులను సేకరించేవారు.
  • విశ్రాంతి దినానికి ముందు రోజున, దేవుడు ఇశ్రాయేలీయులు తమ విశ్రాంతి రోజున మన్నాను సేకరించనవసరం లేకుండా రెండింతలు మన్నాను సేకరించమని చెప్పాడు.
  • “మన్నా” అనే పదానికి అర్థం “అది ఏమిటి?”
  • బైబిలులో, మన్నా “పరలోకం నుండి వచ్చిన రొట్టె” మరియు “పరలోకం నుండి వచ్చిన ధాన్యం” అని కూడా సూచించబడింది.

అనువాద సూచనలు

  • ఈ పదాన్ని అనువదించడానికి ఇతర మార్గాలలో “పలుచని తెల్లటి రేకులు” లేదా “పరలోకం నుండి వచ్చిన ఆహారం”అని ఉండవచ్చు.
  • స్థానిక లేదా జాతీయ భాషలోని బైబిలు అనువాదంలో ఈ పదం ఎలా అనువదించబడిందో కూడా పరిశీలించండి. (చూడండి: [తెలియని వాటిని అనువదించడం ఎలా])

(ఇవి కూడా చూడండి: [రొట్టె], [ఎడారి], [ధాన్యం], [స్వర్గం], [విశ్రాంతి దినము])

బైబిలు రిఫరెన్సులు:

  • [ద్వితీయోపదేశకాండము 8:3]
  • [నిర్గమకాండము 16:27]
  • [హెబ్రీయులు 9:3-5]
  • [యోహాను 6:30-31]
  • [యెహోషువా 5:12]

పదం సమాచారం:

  • Strong's: H4478, G31310