te_tw/bible/kt/jealous.md

3.9 KiB
Raw Permalink Blame History

రోషము, రోషము కలిగియుండడం

నిర్వచనం:

“రోషము," "రోషము కలిగి యుండడం" పదాలు ఒక సంబంధంలోని పవిత్రతను కాపాడడం కొరకైన బలమైన కోరికను సూచిస్తుంది. ఎవరినైనా లేదా దేనినైనా స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోరికను కూడా ఇది సూచిస్తుంది.

  • ఈ పదాలు తరచుగా ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి తమ వివాహంలో అవిశ్వసనీయంగా ఉన్నప్పుడు వారి మీద కలిగియుండే కోపపూరిత భావనను వివరిస్తాయి.
  • బైబిలులో ఉపయోగించబడినప్పుడు ఈ పదాలు తరచుగా తన ప్రజలు పవిత్రంగా నిలిచియుండాలనీ, పాపంచేత మలినం కాకుండా ఉండాలనీ వారికోసం దేవుని కలిగి యున్న బలమైన కోరికను సూచిస్తుంది.
  • దేవుడు తన నామం విషయంలో కూడా "రోషము" కలిగియున్నాడు, ఆ నామాన్ని ఘనపరచాలనీ, భక్తి చూపాలని కోరుతున్నాడు.
  • ఎవరైనా ఒకరు విజయవంతంగా లేదా మరింత ప్రసిద్ధి చెందిన వారు ఉన్నప్పుడు కోపం కలిగి ఉండడం అనే అర్థం ఇమిడి ఉంది. ఇది "ఈర్ష్య" పదానికి దగ్గర అర్థాన్ని కలిగియుంది.

అనువాదం సూచనలు:

  • "రోషం" పదం "రక్షించాలనే బలమైన కోరిక" లేదా "స్వాదీనతా సూచక కోరిక" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "అసూయ పడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బలమైన ఈర్ష్యాసూయలు” లేక “నా స్వంతం అనే ఆలోచన."
  • దేవుణ్ణి గురించి చెప్పేటప్పుడు ఈ పదం అనువాదం ఒకని మీద కోపంగా ఉన్నారనే వ్యతిరేక అర్థం రాకుండా చూడండి.
  • ఇతరులు మరింత విజయవంతంగా ఉన్నప్పుడు వారిపట్ల ప్రజలకు ఉన్న కోపంతో కూడిన తప్పుడు భావనల సందర్భంలో "ఈర్ష్యగా ఉండడం," "ఈర్ష్య" పదాలు ఉపయోగించబడవచ్చు. అయితే ఈ పదాలు దేవునికి ఉపయోగించకూడదు.

(చూడండి:envy)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H7065, H7067, H7068, H7072, G22050, G38630